శాంతిరాం సైకియాట్రీ పీజీ విద్యార్థికి బంగారు పతకం అందజేత
నంద్యాల ప్రతినిధి. ఏప్రిల్ 26 . (నంది పత్రిక ):శాంతిరాం మెడికల్ కాలేజ్ మానసిక వైద్యశాఖ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎస్.మూర్తి 2025 సంవత్సరం నుండి ఉత్తమ సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ శాంతిరాం మెడికల్ కాలేజ్ మానసిక వైద్యశాఖ అధిపతి మరియు ప్రొఫెసర్ డాక్టర్ పి.ఎస్.మూర్తి గ 2025 సంవత్సరం నుండి ఉత్తమ సైకియాట్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి కి ప్రతి సంవత్సరం బంగారు పతకాన్ని ప్రదానం చేయడానికి ఒక ప్రోత్సాహక పతకాన్ని అందజేస్తారు.2025 సంవత్సరం కి గాను డా. పి.ప్రజ్ఞా అనే సైకియాట్రీ పీజీ విద్యార్థికి డా.పి.ఎస్.మూర్తి మెడఎల్ అందజేయటం జరిగినది.తదుపరి 20 సంవత్సరాలపాటు ఈ బంగారు పతకాన్ని వార్షికంగా అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాంతిరాం సంస్థల ఛైర్మన్ మరియు శాంతిరాం మెడికల్ కాలేజ్ జనరల్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ ఎం.శాంతిరాముడు హాజరై, ఉత్తమ పీజీ విద్యార్థికి బంగారు పతకాన్ని అందజేశారు.కార్యక్రమంలో శాంతిరాం మెడికల్ కాలేజ్ వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎం.మాధవీలత , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘురామ్ , మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవిబాబు , ప్రిన్సిపాల్ , మెడికల్ సూపరింటెండెంట్, ఆర్ . యం.ఓ మానసిక వైద్య విభాగం అధ్యాపకులు, పీజీ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comment List