ఘనంగా హై టీ కార్యక్రమ వేడుకలు
ఘనంగా హై టీ కార్యక్రమ వేడుకలు
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 23 . (నంది పత్రిక ):ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో ఘనంగా ఏర్పాటు చేసిన హైటీ క్రిస్టమస్ - 2024 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్టియన్ హై టీ కార్యక్రమంలో సంతోషకరంగా ఉందన్నారు. క్రిస్టియన్ మత పెద్దలు, ఫాస్టర్లు అధికారులు అందరూ కలిసి ఐకమత్యంగా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. ప్రపంచమంతా క్రిస్మ స్ పండుగ జరుపుకుంటున్నారని... ఇది మనందరి పండుగని అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా నిర్వహించుకోవడం మంచి శుభ పరిణామమని కలెక్టర్ సూచించారు. క్రిస్టియన్ సోదరులు స్మశాన వాటికలు కావాలని అడిగారని ఇందుకు సంబంధించి స్థలాలను గుర్తించి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. చిన్నపిల్లలు క్రీస్తు జననం గురించి ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు కలెక్టర్ చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. ఎల్. ఇమ్మానియేల్, విజయ భాస్కర్, ఏసన్న, మణి భాస్కర్, సుందర్, రాజు, పీటర్, జానయ్య, కిరణ్ కుమార్ తదితరులు, జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.
Comment List