నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో 62 వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం
నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో 62 వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం
-జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 05 . (నంది పత్రిక ):నంద్యాల స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం నందు 62 వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పాల్గొని హోంగార్డు నుండి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ "పోలీస్ శాఖలో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా నిశ్వార్థంగా సేవ చేస్తున్న మీకు నా జోహార్లు" అని తెలియజేశారు.పోలీసు సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు ఎన్ని సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో వారి కంటే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఈ విషయంలో నంద్యాల జిల్లా పోలీస్ శాఖ తరపున హోంగార్డులకు అభినందనలు తెలిపారు. హోంగార్డ్స్ నంద్యాల జిల్లా 494 హోం గార్డ్స్ మంది శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, లా & ఆర్డర్స్ డ్యూటీ, డ్రైవర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల యందు, దేవాలయాల యందు భద్రత కొరకు మరియు టెక్నికల్ కెటగిరీల యందు పనిచేయుచున్నారు మరియు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఉండడం వల్ల వారితో సమానంగా హోంగార్డులు విధులను కూడా నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా నిస్వార్థ సేవే మా దృఢ నిచ్చయం అనే విధంగా విధులు నిర్వహిస్తున్నందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు మరియు మీ సంక్షేమం కోసం పోస్టల్ యాక్షిడెంటల్ పాలసీని ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని తద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 15 లక్షలు మీ కుటుంబానికి అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.
Comment List