అసాంఘిక , సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
అసాంఘిక , సంఘ విద్రోహశక్తుల ఆట కట్టించి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 01 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు నేడు తెల్లవారు జామున పోలీసు అదికారులు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి నంద్యాల జిల్లాలోని 04 ప్రాంతాలలో అనగా డోన్ సబ్ డివిజన్ అవుకు పోలీసు స్టేషన్ పరిదిలోని కొండమనాయునిపల్లె గ్రామం, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ సంజామాల పోలీసు స్టేషన్ పరిదిలోని ఆల్వకొండ గ్రామం, నంద్యాల సబ్ డివిజన్ పాణ్యం పోలీసు స్టేషన్ పరిదిలోని సుగాలిమెట్ట గ్రామం,ఆత్మకూరు సబ్ డివిజన్ వెలుగోడు పోలీసు స్టేషన్ పరిదిలోని రేగడగూడూరు గ్రామంలో ఏకకాలంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా అనుమానితులు, నేరచరిత్ర గలవారు ఇళ్లలో సోదాలు నిర్వహించి సరైన దృవపత్రాలు లేని సుమారు 31 మోటార్ సైకళ్ళు సుమారు 300 kg బెల్లం 80 లిటర్ల నాటు సారాయి స్వాదినం చేసుకోవడంతో పాటు సుమ్మరు 1000 లీటర్ల బెల్లం ఊటను పారబోయడం జరిగింది.అనంతరం ఆయా గ్రామాలోని నేరచరిత్ర గల వారికి,రౌడీషీటర్లు, సస్పెక్ట్ లకు గ్రామాలలో ఎలాంటి అల్లర్లు ,గొడవలు పాల్పడకుండా ఐకమత్యంతో ఉంటూ సత్ ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సిలింగ్ నిర్వహించి, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే అటువంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిరంతరం కొనసాగుతుంటాయని పోలీసు అధికారులు తెలిపారు.ఈ కార్యాక్రమంలో 05 ఇన్స్పెక్టర్ లు,12 మంది సబ్ ఇన్స్పెక్టర్ లు, 100 మంది పోలీసు సిబ్బంది మరియు పోలీసులు పాల్గొన్నారు.
Comment List