ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు
ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు
అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
మహానంది డిసెంబర్ 3 (నంది పత్రిక ):-
అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని సమగ్ర శిక్ష విలీన విద్య విభాగం సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు పేర్కొన్నారు.మహానంది మండలం గాజులపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 65వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేటు రంగాలలో విభిన్న ప్రతిభావంతుల నాయకత్యాన్ని ప్రోత్సహించి,సమాజ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు.అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు,ఐఈడీఎస్ఎస్ సుబ్బారెడ్డి,ఐఈఆర్టిలు బి.హైమావతి,డి.సురేఖ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comment List