ఉమామి తబ్లిగే ఇజ్తెమా కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తాము
ఉమామి తబ్లిగే ఇజ్తెమా కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తాము
-మంత్రి ఎన్.యం.డి ఫరూక్
నంద్యాల ప్రతినిధి. నవంబర్ 29 . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా జనవరి 7,8 ,9 వ తేదీల్లో ఆత్మకూరులో జరగబోయే ఉమామి తబ్లిగే ఇజ్తెమ ఏర్పాట్లను శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్.యం.డి ఫరూక్ , నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు ముస్లిం మత పెద్దలు పరిశీలించడం జరిగింది .ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ ఆత్మకూరులో జరగబోయే ఉమామి తబ్లిగే ఇజ్తెమా కు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఇస్తామాకు వచ్చే వారు పోలీస్ వారికి రెవెన్యూ వారికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి అన్ని డిపార్ట్మెంట్ల వారికి సహకరించాలన్నారు ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే అక్కడున్నటువంటి అధికారులకు తెలియజేయాలని తెలిపారు అలాగే ఇస్తామాను జయప్రదం చేయాలని కోరారు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులో నన్నూరు టోల్ ప్లాజా దగ్గర కూడా ఇస్తామాను ఏర్పాటు చేయడం జరిగిందని అప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తామాకు 10 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందన్నారు అప్పుడు అధికారుల సహకారంతో ఇస్తామను జయప్రదం చేయడం జరిగిందని అలాగే మరొకసారి నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఇస్తామాకు అవకాశం కల్పించడం ఆ అల్లా దయనే అని ఈ అవకాశాన్ని కూడా మనమందరం సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని కోరారు . అలాగే ఇస్తామాకు వచ్చేవారి కోసం నిర్వాహకులు కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా కమిటీ వారు అన్ని చర్యలు తీసుకుని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఇస్తామాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో ముందుకెళ్లాలని కోరారు . కమిటీలను ఏర్పాటు చేసుకొని అందరి కోఆర్డినేషన్ తో పనులు చేసుకోవాలని కోరారు.ఇస్తామాకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే మాకు తెలియజేయాలని అలాగే ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ తెలిపారు
ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నా నియోజకవర్గంలో ఇస్తామాను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని ఏర్పాట్లను , సౌకర్యాలను శరవేగంగా నిర్వహిస్తామన్నారు . ఇస్తామా ను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో పనిచేయాలని తెలిపారు .ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అలాగే పార్కింగ్ కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే హెల్ప్ డిస్క్ ను కూడా ఏర్పాటు చేస్తామని ఏదైనా సహాయం కావాలంటే అక్కడ అడిగి తెలుసుకోవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు , అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Comment List