మాటిచ్చిన విధంగానే హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడుతున్నాం
మాటిచ్చిన విధంగానే హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడుతున్నాం..
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన కర్నూలు బార్ అసోసియేషన్ న్యాయవాదులు
అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారు..
కర్నూలు నంది పత్రిక.........ఎన్నికల సమయంలో మాటిచ్చిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయనున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో కర్నూల్ బార్ అసోసియేషన్ తరుపున న్యాయవాదులు మంత్రి టి.జి భరత్‌ను కలిశారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయడం పట్ల మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒకటి తర్వాత మరొకటి నెరవేర్చుతున్నారన్నారు. ఇందులో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు. గత ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుచేస్తామని చెప్పినా చేయలేకపోయిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ప్రక్రియ ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని ఆయన న్యాయవాదులను కోరారు. మంత్రిని కలిసిన వారిలో కర్నూల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రిష్ణమూర్తి, స్టేట్ బార్ అసోసియేషన్ సభ్యులు రవి గువేరా, జయరాజు, సీనియర్ న్యాయవాది జహంగీర్ బాషా, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ సింగ్, బీజేపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, న్యాయవాదులు ఓంకార్, షాహుద్దీన్, శాంతకుమార్, అయ్యస్వామి, జయసింహ, శ్రావన్, తేజస్విని, తదితరులు ఉన్నారు.
Comment List