జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
-జిల్లా ఇంచార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్
నంద్యాల బ్యూరో. డిసెంబర్ 10. (నంది పత్రిక ):జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా సర్వతోముఖఅభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక & వాణిజ్య పన్నులు మరియు మంత్రివర్యులు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా మంత్రులు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనములు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి లతో కలిసి సుదీర్ఘ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిత్త జయసూర్య, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మన బాధ్యతలను గుర్తించుకొని జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటు బడ్జెట్ లో ఉందని గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు సమిష్టి కృషి చేయాలని మంత్రి తెలిపారు. సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు సరైన నాయకున్ని ఎన్నుకొని కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారన్నారు. లేనిపక్షంలో వెండి లెటర్ పై ఉన్న రాష్ట్రం అధఃపాతాళానికి వెళ్లిపోయే ప్రమాదం జరిగేదన్నారు. దాదాపు లక్ష 32 వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రివర్గం శక్తికి మించి పనిచేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకు తగ్గట్టుగా అధికారులందరూ సహకరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆగిపోయిన 73 పథకాలను ఆరు వేల కోట్ల రూపాయలతో పునరుద్ధరించామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజావసరలకు ఉపయోగపడే పనులు చేపట్టి పూర్తి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని పరుగుపెట్టే దిశలో కమిట్మెంట్తో పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలని మంత్రి సూచించారు. జిల్లాలో వరి, ఇతర ధాన్యపు పంటలకు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వమే ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయడంతో పాటు 48 గంటలలో రైతులకు సంబంధిత మొత్తాలను అందజేస్తామన్నారు. రైస్ మిల్లు ట్రేడర్లతో సమావేశం నిర్వహించి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ చేసే రైతులకు సంబంధిత కంపెనీల ప్రతినిధులను పిలిపించి ఆయిల్ ఫామ్స్ సాగు దిగుబడి లాభాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. శాసన సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను ప్రత్యేక లేడ్జర్ బుక్ లో నమోదు చేసుకొని సాధ్యాసాధ్యాలపై శాసనసభ్యులకు తిరిగి వివరించాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, జవాబుదారీ తనంతో పని చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన అర్జీలను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తూ 65 వేల ఎకరాలలో ఉన్న ఫ్రీ హోల్డ్ భూములపై ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. ఆళ్లగడ్డ నంద్యాల, పట్టణాల్లో కేసి కెనాల్ ఆధీనంలో ఉన్న భూముల ఆక్రమణపై కమిటీ ఏర్పాటు చేసి పూర్తీ స్థాయిలో వివరించాలన్నారు.*
*రాష్ట్ర రోడ్లు భవనములు, మౌలిక సదుపాయాలు పెట్టబడులు శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందని సంక్షేమము అభివృద్ధి సమానంగా తీసుకొని సమాన స్థాయిలో తీసుకొని పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో అధికారులందరూ సహకరించాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తే ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్నారు. జాతీయా రహదారులు, రైల్వే, సాగు నీటి ప్రాజెక్ట్ లకు అవసరమైన భూసేకరణకు ఫారెస్ట్ అధికారులు సహకరించాలన్నారు. శాసనసభ్యులు సూచించిన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాధాన్యత క్రమంలో పనులు చేయాలని సూచించారు. రానున్న వేసవి నీ దృష్టిలో ఉంచుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సిసి రోడ్లు, గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసి 50 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు.*
*రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ సమావేశంలో శాసనసభ్యులు సూచించిన సమస్యలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని విషయాలు క్షుణ్ణంగా చర్చించామని ప్రభుత్వం పని చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెప్పట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.రాబోయే ఒకటి,రెండు సంవత్సరాలు ఇబ్బందికరంగా వుతుందని వున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళలన్నారు.*
*జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు కూడా వన్ బి రికార్డులు తీసుకొని పంటరనాల మంజూరు చేయాలని అన్ని బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రికి వివరించారు. ఉపాధి హామీ పధకం క్రింద మెటీరియల్ కాంపోనెంట్ నిధులను అన్ని మండలాలకు సమాన స్థాయిలో విభజించి రోడ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.*
*డోన్ శాసన సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో తాగు నీటి నివారణకు గోరుకల్లు రిజ్వయర్ నుండి చేపట్టిన తాగు నీటి పైప్ లైన్ నిర్మాణానికి నిధులు కేటాయించి పూర్తిచేయాలని మంత్రిని కోరారు.*
*ఆత్మకూరు శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రిని కోరారు.*
*ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రకృతి, ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న సమగ్ర రక్షిత నీటి పథకాన్ని పూర్తిచేసి 20 గ్రామాలకు నీరు అందించాలని మంత్రిని కోరారు*
*పాణ్యం శాసనసభ్యులు గౌరవ చరితారెడ్డి మాట్లాడుతూ గడివేముల మండలంలో పంట నష్టపోయిన సోయాబీన్ రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
Comment List