రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు

On

రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20241217_214831

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 17 . (నంది పత్రిక ):జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, డిటిసి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రహదారుల భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత రోడ్డు భద్రత సమీక్ష సమావేశంలో సూచించిన అజెండా అంశాలకు తీసుకున్న చర్యల నివేదికలు సంతృప్తికరంగా లేవని కలెక్టర్ స్పష్టం చేస్తూ వచ్చే సమావేశానికి పూర్తిస్థాయి చర్యలు తీసుకొని ఖచ్చితమైన భద్రతా ప్రమాణాల ఏర్పాట్లు చేసినట్లు నివేదికలు ఇవ్వాలన్నారు. నంద్యాల పట్టణంలో గుర్తించిన 23 బ్లాక్ స్పాట్ల్లో ఎలాంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ఆరా తీశారు. శాంతిరాం మెడికల్ కాలేజీ, చాబోలు, కుందు బ్రిడ్జి, బొగ్గులైన్ తదితర బ్లాక్ స్పాట్ లలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, ఎలిమినేషన్, గుర్తింపు సూచికల బోర్డులు, జిగ్ జాగ్ బారికేడింగ్ తదితర పనులు చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బొమ్మల సత్రం నుండి నూనెపల్లె బ్రిడ్జి వరకు 2.4 కిలోమీటర్ల రోడ్డు పనులను సంబంధిత కాంట్రాక్టర్ చే క్లియర్ ఉన్నచోట వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. ఇకనుంచి నెలకోసారి సమావేశాలు నిర్వహించాలని ప్రతి సమావేశంలో గత సమీక్షలో తీసుకున్న చర్యలు క్షేత్రస్థాయిలో క్విక్ గా అమలు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లాలో ఉన్న ఏడు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులలో సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాద ఘంటికల ప్రదేశాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అమలు చేయాలన్నారు. చెప్పాం చేశామన్న రీతిలో కాకుండా ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉండి ప్రాణ భద్రత కల్పించాలన్నారు. గుత్తేదారు సపోర్టు లేకపోయినా, నిధుల కొరత వున్నా తమ దృష్టికి తెస్తే రాష్ట్రస్థాయిలో సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్స్‌, స్టాపర్స్‌, ప్రమాద సంకేత సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పాఠశాలలు, కళాశాలలు ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 1033 హెల్స్‌లైన్‌ బోర్డులు, SOS బటన్ నొక్కడం, ప్రతి టోల్ ప్లాజా లో అంబులెన్స్ తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. ఆర్టీసీ బస్టాండు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ముఖ్య కూడలి రద్దీ ప్రదేశాల్లో రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్, ట్రాఫిక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.*

 

*జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ ప్రధాన రహదారిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించడంతోపాటు స్పీడ్ బ్రేకర్ల ముందు, వెనుక భాగాల్లో పెయింటింగ్ వేయాలన్నారు. జిల్లాలో ఉన్న నలుగురు డిఎస్పీలు రోడ్డు ప్రమాదాలకు సంబంధించి హిట్‌ అండ్‌ రన్‌ కేసుల బాధితులకు పరిహారం చెల్లింపుపై ఆర్డీఓలతో సమన్వయం చేసుకొని నివేదికలు ఇవ్వాలన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు