నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్యం పై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు

On

నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో ఆరోగ్యం పై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు

IMG_20241217_131042

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 17 . (నంది పత్రిక ):భారతీయ వైద్య సంఘం నంద్యాల మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో కళాశాలల స్థాయిలో ఆరోగ్యం, వైద్యం పై బాలికలకు క్విజ్ పోటీలు నిర్వహించారు.ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో, కార్య దర్శి డాక్టర్ అనూష సహకారంతో నిర్వహించిన ఈ క్విజ్ పోటీలలో శాంతిరాం ఫార్మసీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల, ఎస్విఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నేషనల్ డిగ్రీ కళాశాల, రావుస్ జూనియర్ కళాశాలలకు చెందిన ఆరు బాలికల జట్లు పాల్గొన్నాయి.డాక్టర్ కల్పన,డాక్టర్ సౌజన్య, డాక్టర్ అనూష, డాక్టర్ శశి కిరణ్,డాక్టర్ శిల్పా వివిధ రౌండ్లకు క్విజ్ మాస్టర్లు గా,రౌండ్ కు 12 ప్రశ్నలు చొప్పున నాలుగు రౌండ్లు, ఒక రాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించిన ఈ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన శాంతిరాం ఫార్మసీ కళాశాల, ద్వితీయ స్థానం సాధించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల జట్లకు ట్రోఫీలు, పాల్గొన్న ఆరు జట్ల సభ్యులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ, మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ సరిత, డాక్టర్ ప్రసన్న,డాక్టర్ శిల్ప, డాక్టర్ శశికిరణ్, పోషకాహార నిపుణురాలు తేజస్విని, కళాశాల అధ్యాపకులు లలితా సరస్వతి అధిక సంఖ్యలో కళాశాలల విద్యార్థినిలు పాల్గొన్నారు.

    ముగింపు కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సేవా కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉన్నారని ప్రత్యేకించి మహిళా వైద్యులు ఇటీవల కాలంలో వివిధ విద్యాసంస్థలలో వైద్య అవగాహన సదస్సులు నిర్వహించడం, అటవీ ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రశంసమనీయమని కొనియాడారు.డాక్టర్ కల్పన, డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు ,డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ వైద్యులు సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక సేవ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని ప్రజలతో మమేకం కావడమే తమ లక్ష్యమని అన్నారు. విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కల్పించడం ద్వారా వారు తమ కుటుంబాలలో, చుట్టుపక్కల ఉన్న ప్రజలలో ఆరోగ్య జాగ్రత్తలపై వివరించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు