ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించండి

On

ప్రజా సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించండి

-పిజిఆర్ఎస్ లో స్వీకరించిన 187 ఫిర్యాదులు

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20241216_222011

నంద్యాల బ్యూరో. డిసెంబర్ 16. (నంది పత్రిక ):రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల  పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోపాటు మానవతా కోణంలో ఆలోచించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమీక్ష నిర్వహించి, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.*

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలు విజయవంతం చేసిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కలెక్టర్ అభినందించారు. పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను మానవతా కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులోపే పరిష్కరించాలన్నారు. గడువులోపు నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా ప్రగతి కుంటుపడుతోందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. నగరవనం, నగర వాటికల ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని ఆర్డీఓలను ఆదేశించారు.*

*ప్రతి శాఖలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేశామని ఇందులో చురుకైన, బాధ్యత కలిగిన అధికారులను నియమించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజాభివృద్ధికి సంబంధించి అన్ని శాఖల సమాచారం సమీకృతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లాలో జరిగే అన్ని శాఖల కార్యకలాపాలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ప్రభుత్వ ఆదేశాల మేరకు జాగ్రత్తగా పనులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 19 నుండి 24వ తేదీ వరకు (గుడ్ గవర్నెన్స్ వీక్) సుపరిపాలన వారోత్సవాలు నిర్వహిస్తోందని ఈ మేరకు ప్రజా సర్వీసులకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంధన పరిరక్షణ - విద్యుత్ ఆదా సంబంధిత అంశాల గోడపత్రికలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత విద్యుత్ అధికారులు ఆవిష్కరించారు.*

*పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు*

*1) డోన్ మండలం రాయదుర్గం గ్రామ కాపురస్తురాలు కావేరమ్మ తన జీవనోపాధికి గేదెలు, ఆవులతో పాడి నిర్వహించుకునేందుకు రుణం మంజూరు చేయించాల్సిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తును సమర్పించుకున్నారు.*

*2) వెలుగోడు మండల కేంద్రానికి చెందిన రాజేంద్ర తాను కొన్ని సంవత్సరాల నుండి వెలుగోడు అటవీ ప్రాంతం నుండి వెదురు బొంగులు తెచ్చుకొని బుట్టలు, గంపలు, తడికెలు చేసుకొని జీవనోపాధి చేసుకునేవాడిననీ....  ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అడివిలోకి అనుమతించడం లేదని అడివిలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తును సమర్పించుకున్నారు.*

*ఇంకా ఈ కార్యక్రమంలో 187 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు