ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసి అడవి బిడ్డలకు విద్య అందించండి.
ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసి అడవి బిడ్డలకు విద్య అందించండి.
- ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి.
*నంద్యాల జిల్లా బ్యూరో :-న్యూఢిల్లీ డిసెంబర్ 04 (నంది పత్రిక)*
నంద్యాల జిల్లా నల్లమల అరణ్యంలోని శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలలో ఉన్న చెంచు గూడెంలలో గిరిజన చిన్నారులకు ( అడవి బిడ్డలకు ) ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేసి వారి చదువులను ప్రోత్సహించాలని
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జ్యూయల్ ఆరంను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
మంగళవారం ఢిల్లీలోని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయంలో కేంద్ర గిరిజన శాఖ మంత్రిని నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలలో "ఏకలవ్య పాఠశాల"లను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయనకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
"ఏకలవ్యా పాఠశాలలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రవేశపెట్టారని, గిరిజన బిడ్డల విద్య, జీవన నైపుణ్యాల అభివృద్ధిపై ఏకలవ్య పాఠశాలలు దృష్టి సారిస్తాయన్నారు.
Comment List