శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో హైందవ శంఖారావానికి నాంది
శ్రీశైల మల్లన్న ఆశీస్సులతో హైందవ శంఖారావానికి నాంది
నంద్యాల ప్రతినిధి. నవంబర్ 27 . (నంది పత్రిక ):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై రాజకీయ పెత్తనం వీడి స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 5 జనవరి 2025 న జరగబోతున్న భారీ బహిరంగ సభ హైందవ శంఖారావం కు సంబంధించిన మొట్ట మొదటి మండల హిందూ సమ్మేళనం శ్రీశైలం లో బుధవారం జరిగింది.ఈ సందర్భంగా పలువురు స్వామీజీలు వేద ఆశీర్వచనాలతో మండల సమ్మేళనాన్ని ప్రారంభించారు ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ యుగంధర్ గారు దేవాలయాల్లో రాజకీయ జోక్యాలు మితిమీరాయి అన్నారు.హైందవ శంఖారావం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్ యర్రం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ సమాజానికి దేవాలయాలను స్వయంగా నిర్వహించుకునే శక్తి ఉందని దేవాలయాలు రాజకీయ నిరుద్యోగులకు అడ్డాలు కాదని అన్నారు.ఈ సమ్మేళనంలో హైందవ శంఖారావం జిల్లా కన్వీనర్ కిషోర్ ,రవాణా ప్రముఖ్ రాంప్రసాద్ నంద్యాల జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ గిరిధర్ బాబు , ఎలిశెట్టి మణికంఠ ,మల్లికార్జున , కాశయ్య నారాయణ, సంజీవరాయుడు మరియు వెయ్యికి పైగా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List