పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 96 ఫిర్యాదులు
పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 96 ఫిర్యాదులు
-విచారణ జరిపి చట్ట పరిదిలో న్యాయం చేస్తాం-
నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
నంద్యాల క్రైమ్ . డిసెంబర్ 16. (నంది పత్రిక ):నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదిదారుల నుంచి *96* ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని , ఫిర్యాదులను మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని , నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులతో చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు మొదలగునవి ఉన్నాయి.
Comment List