బాధితులకు న్యాయం చేయాలి ... జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఐపియస్  

On

బాధితులకు న్యాయం చేయాలి ... జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఐపియస్  

 విజిబుల్ పోలీసింగ్ తోనే నేర నివారణ సాధ్యం

 లాంగ్ పెండింగ్ , గ్రేవ్ , సైబర్ నేరాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

నేరస్తుల కదలిక ల పై ప్రత్యేక నిఘా ఉంచాలి. 

 సైబర్ నేరాలకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరణ చేసిన ....జిల్లా ఎస్పీ.

విధుల్లో ప్రతిభ కనబరచిన పోలీసులను అభినందించిన ... జిల్లా ఎస్పీ . 

IMG_20241128_210624

కర్నూలు నంది పత్రిక..........ప్రాపర్టీ కేసులలో , సైబర్ నేరాల కేసులలో బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఐపియస్ అన్నారు. 

ఈ సంధర్బంగా గురువారం స్ధానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైల తో జిల్లా ఎస్పీ గారు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడారు.  

కర్నూలు , పత్తికొండ , ఆదోని , ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి సమీక్షించి ఆరా తీశారు.

 పోలీసుస్టేషన్ల వారీగా కేసుల పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

2022 , 2023, 2024 సంవత్సరాల వారీగా చాలా కాలంగా ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇయర్ ఎండింగ్ లో ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలన్నారు. 

యుఐ కేసులు తగ్గించాలన్నారు.

ఎవరినైనా అరెస్టు చేసే ముందు అరెస్టుకు సంబంధించిన విషయాలను తెలియజేయలన్నారు.

Pocso కేసులలో, పెండింగ్ ట్రయల్ కేసులలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో మాట్లాడి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

లోక్ అదాలత్ లో కాంపౌండబుల్ కేసులు తగ్గించాలన్నారు .

రోడ్డు ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. 

రోడ్డు ప్రమాదాలలో బాధితులకు తగిన నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ - చాలన్ లు రికవరీ చేయాలన్నారు.

సైబర్ చీటింగ్ కేసుల్లో బాధితులు మోసపోయిన నష్టాన్ని బ్యాoకులలో ఫ్రీజ్ చేయించిన ఆ మొత్తాన్ని కోర్టు అనుమతి తో బాధితులకు అందజేయాలన్నారు.

ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే 1930కి వెంటనే ఫిర్యాదు చేసే విధంగా ప్రజలకు అవగాహన చేయాలన్నారు. 

వెంటనే ఫిర్యాదు చేస్తే నష్ట శాతాన్ని తగ్గించవచ్చన్నారు.

విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

నేర నివారణకు కృషి చేయాలన్నారు. 

 

పోలీసులకు అభినందన

 

ప్రాపర్టీ కేసులలో , వార్షిక ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. 

 

ప్రశంసాపత్రాలు అందజేశారు. 

 

సైబర్ నేరాల కరపత్రాల ఆవిష్కరణ

నేర సమీక్ష సమావేశం అనంతరం 

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు .సైబర్ నేరాలకు సంబంధించిన అవగాహన కరపత్రాలను జిల్లా ఎస్పీ ఆవిష్కరణ చేశారు.

ఆయా సబ్ డివిజన్ లలో ప్రజలకు అవగాహన చేయాలని పోలీసు అధికారులకు తెలిపారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ జి .హుస్సేన్ పీరా గారు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డిఎస్పీలు జె. బాబు ప్రసాద్, సోమన్న, వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ మరియు సిఐలు , ఎస్సైలు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు