ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం

On

ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వం

-ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తూచా అమలు

-పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఫరూక్

IMG_20241130_170433

నంద్యాల బ్యూరో. నవంబర్ 30 . (నంది పత్రిక ):ఇది ప్రజల సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను సగర్వంగా నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి మాసం నుంచే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రతినెలా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నామని అన్నారు. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే ప్రభుత్వం నవంబర్ 30 నే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు . అందులో భాగంగా శనివారం నంద్యాల నియోజకవర్గం లోని 29 వ వార్డు టిడిపి ఇంచార్జ్ మంజుల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో షాదిక్ నగర నందు మంత్రి ఫరూక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు తో పాటు మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టామని తెలిపారు అంతేకాకుండా గత వైసిపి ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో  తీవ్ర అధ్వానంగా ఉన్న రోడ్లను కూటమి ప్రభుత్వం బాగు చేయించే కార్యక్రమాన్ని కూడా చేపట్టిందని గుర్తు చేశారు. గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టి పంచాయతీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చూస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు. టీడిపి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి మయం అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, రంగాలను వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 మాసాల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లులా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి , కౌన్సిలర్ శ్రీదేవి , వాకా శివశంకర్ యాదవ్ , గుద్దేటి వెంకటేశ్వర్లు , జెపి , బ్యాంక్ తిమ్మయ్య , చాబోలు ఇలియాజ్ , బద్రిశెట్టి రవికుమార్ , నాగరత్నమ్మ , సాయిరాం , జ్యోతి రాయల్ , వేద సాయి , సంపంగి జయకృష్ణ , మంజుల సుధాకర్ , నరేష్ మరియు సచివాలయ సిబ్బంది ,  మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు