రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి

On

రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి

నిర్ణీత కాలవ్యవధిలో అర్జీలను పరిష్కరించండి
 IMG_20241221_211259

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 21. (నంది పత్రిక ):రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రసీదును సంబంధిత అర్జీదారులకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి  రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ తో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవిన్యూ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల ప్రగతిని సమీక్షిస్తూ రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు రసీదును సంబంధిత అర్జీదారులకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో పరిష్కరించదగ్గ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి సంబంధిత నివేదికలను పంపాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన అర్జీలలో పరిష్కరించిన వాటిలో ఉత్తమైన పరిష్కారాలుగా గుర్తించిన వాటి వివరాలను పంపాలని ఆర్డిఓలను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన ప్రతి ఒక్క అర్జీని నిర్ణీత వ్యవధిలోపల తప్పనిసరిగా పరిష్కరించాలని తెలిపారు. ఇప్పటివరకు పరిష్కార నివేదికలో ఇవ్వని మండలాలు సంబంధిత పరిష్కార వివరాల నివేదికలు త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.  ప్రతి సమస్యకు నాణ్యతతో కూడిన పరిష్కార మార్గాన్ని సూచించాలన్నారు. ఆర్డీఓ, తాసిల్దార్ కార్యాలయాల్లో రికార్డు రూములు సక్రమంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలు వాటి ఎండార్స్మెంట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నిశితంగా పరిశీలిస్తున్నందువల్ల ప్రతి అర్జీని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా నిర్ణీత వ్యవధి లోపల పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కారంలో తలెత్తిన లోపాలను సరిదిద్దుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులకు పెండింగ్లో ఉన్న భూసేకరణ, ఇతర పనుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, అన్ని మండలాల తాసిల్దారులు, మండల స్పెషల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు