తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి

On

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి

-మాస్టర్ ప్లాన్ కు అవసరమయ్యే నివేదికలు ఇవ్వండి

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20241128_180158

నంద్యాల ప్రతినిధి. నవంబర్ 28  . (నంది పత్రిక ):తిరుమల క్షేత్ర తరహాలోనే శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా  అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధిపై జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా, ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతి, సర్వే ల్యాండ్ ఏడి జయరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం మహా క్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించి నివేదికలు పంపాలని గత సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన దేవాదాయ, పర్యాటక, ఆర్ అండ్ బీ మంత్రుల కమిటీ సమావేశంలో నిర్దేశించారన్నారు. ఈ మేరకు జిల్లాలో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు అవసరమయ్యే నివేదికలను శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలని దేవాదాయ, అటవీ, సర్వే అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాబోయే రెండు సంవత్సరాలలో శ్రీశైలం క్షేత్రాన్ని  తిరుమల క్షేత్ర తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో నివేదికలు తయారు చేసి ఇస్తే మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. గతంలో దేవాదాయ, అటవీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను కూడా పొందుపరచాలని సర్వే అండ్ ల్యాండ్స్ ఏడి ఆదేశించారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన అటవీ విస్తీర్ణం, అటవీ సరిహద్దుల సర్వే, గజిట్ నోటిఫికేషన్, నందికొట్కూరు రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణుల నిషేధిత భూములు సంబంధిత వివరాలతో నివేదికలు అందజేయాలని డిఎఫ్ఓ ను కలెక్టర్ ఆదేశించారు.శ్రీశైల దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములు, అటవీ సరిహద్దుల నుండి రక్షణ గోడలు, తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి సంబంధించిన నివేదికలను అందజేయాలని శ్రీశైలం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి గతంలో మంత్రుల కమిటీ సూచించిన అంశాలు, తయారు చేసిన నివేదికలను కూడా అందచేయాలన్నారు. సున్నిపెంట నుండి శ్రీశైలం వరకు 2.5 కిలోమీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు ప్రతిపాదనలు, రహదారి విస్తరణ సంబంధించిన పనులు కూడా మాస్టర్ ప్లాన్ నివేదికలో పొందుపరుస్తామని కలెక్టర్ తెలిపారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు