ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించండి

On

ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించండి*

-విఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి

-పిజిఆర్ఎస్ కు 101 సమస్యలు

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20241202_172057

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 02 . (నంది పత్రిక ):ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని ఇష్టానుసారంగా రెడ్రెస్ చేయకుండా సానుభూతితో పరిష్కరించాలని జిల్లాల్లా కలెక్టర్ జి. రాజకుమారి జిల్లా, మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వినుతులను స్వీకరించారు. డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది జిల్లా, మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వయంగా సమీక్షిస్తున్నప్పటికి సీరియస్ గా తీసుకోకుండా ఎండార్స్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆదేశించారు. సరైన రీతిలో ఎండార్స్మెంట్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ కూడ పెండింగ్లో ఉన్నాయని పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తమవిగా భావించి జవాబుదారితనంతో పరిష్కరించాలన్నారు. జిల్లాలో భూ సమస్యల అధికంగా ఉన్నాయని వాటి పరిష్కారంలో ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనులు చేయాలన్నారు.రెవెన్యూలో కీలక పాత్ర పోషించే విఆర్ఓలు అవినీతికి పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పనితీరు మెరుగుపరచుకొని అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేయాలని కలెక్టర్ మండల స్థాయి విఆర్ఓ లను ఆదేశించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే తీవ్ర కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సర్వీసులు అందించడంలో సంబంధిత వ్యక్తులను కార్యాలయాల చుట్టూ పదేపదే తిప్పుకోకుండా నిర్ణీత కాల వ్యవధిలో మెరుగైన సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో విఆర్ఓ వ్యవస్థ ప్రక్షాళన జరిగి ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామసభల ద్వారా 14 వేల భూ సమస్యలు స్వీకరించారని సంబంధిత ఆర్డీఓలు, తాసిల్దారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈనెల 6వ తేదీ లోపల అప్లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పిజిఆర్ఎస్ కింద 730 సమస్యలు, బియాండ్ ఎస్ఎల్ఎ లో 44, రీఓపెన్ లో 21 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వీటన్నింటిని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.*

 

*ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు*

 

*1)పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ కాపురస్తుడు చిన్న నాగన్న తనకు 2 ఎకరాల 14 సెంట్ల భూమి ఉందనీ.. సమీప బందువులు తనకు తెలియకుండా ఆ భూమిని ఆన్లైన్ లో, పట్టాదారు పాసు పుస్తకాలు చేయించుకున్నారని విచారణ జరిపి తన పేరుమీద ఆన్లైన్ లో మరియు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.*

 

*2) నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామ వాస్తవ్యుడు ఖాజా మొహిద్దిన్ తనకు గ్రామపొలిమేర లో సర్వే నంబర్ 269లో 4.70 ఎకరాల భూమి ఉన్నదనీ, రీ సర్వే చేసినప్పుడు 1.09 ఎకరాల ఆన్లైన్లో చూపించటం లేదని కేవలం 3.61 ఎకరాల భూమి మాత్రమే చూపిస్తుందని... తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.*

 

*ఇంకా ఈ కార్యక్రమంలో 101 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జేసీ ఆదేశాలు జారీ చేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు