పాణ్యం నియోజకవర్గంలో నీ ప్రజల సమస్యలు పరిష్కరించండి
పాణ్యం నియోజకవర్గంలో నీ ప్రజల సమస్యలు పరిష్కరించండి
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కర్నూలు నంది పత్రిక..... పాణ్యం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని సోమవారం సునయన ఆడిటోరియంలో జరిగిన గ్రీవెన్స్ డే లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత సంవత్సరం జనవరిలో వైసీపీ మూకలు పెట్రోల్ పోసి తగలబెట్టిన కల్లూరు మండలం, కొంగనపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త, మాజీ సర్పంచ్ నాగయ్యకు చెందిన రూ. 30 లక్షల విలువైన మిరిపపంటకు నష్టపరిహారం అందించాలని, అంతేకాకుండా ఓర్వకల్లు మండలం భైరాపురం గ్రామ రైతులు గత కొన్నేళ్లుగా సాగు చేసుకున్న పొలాలకు పుస్తకాలు ఉన్నా భూవివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని, వెంటనే చొరవ తీసుకుని, వారి సమస్యను పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష కి తెలియజేశారు.జిల్లా కలెక్టర్ వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఆమెకు తెలియజేశారు.
Comment List