పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన వాజ్యం కొట్టివేత
పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన వాజ్యం కొట్టివేత
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. నవంబర్ 26. . (నంది పత్రిక ):భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని పునః ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసినట్లు జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ పై పిటిషనర్ డాక్టర్ కె.ఎ. పాల్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని అన్నారు. పిటిషన్ ను తిరస్కరించిన సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని, ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈ.వి.ఎం.ల విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అస్థిరతను ఎత్తిచూపిందన్నారు. పిటిషనర్ వాదనల్లో ఎలాంటి మెరిట్‌ను కనుగొనలేదని, ఎన్నికల్లో ఈవీఎంల వ్యవస్థతో రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.బి.వరాలే లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసిందని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
Comment List