కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి

On

కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి

-ఆధునిక వ్యవసాయ పద్దతులు, నూతన వంగడాలు, పంట సాగులో కొత్త మెళకువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి రైతులు అందిపుచ్చుకోవాలి

 -భవిష్యత్తులో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుందన్న మంత్రి

-ఆకట్టుకున్న వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలు

GridArt_20241218_224716118
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 18 . (నంది పత్రిక ):మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్,  రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా మైదానంలో  నిర్వహించిన "కిసాన్ మేళా" కార్యక్రమాన్ని మంత్రులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏడిఆర్ఆర్ డా. ఎం జాన్సన్, ఆచార్య ఎన్ జి రంగా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మి దేవి, బోర్డు మాజీ సభ్యులు భగీరథ చౌదరి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను అవలంబించి అధిక దిగులు సాధించాలని ఆకాంక్షించారు. తూర్పు ప్రాంతంలో ఎన్నో కాలువలు ఉన్నాయని మన ప్రాంతంలో కేసీ కెనాల్ మాత్రమే ఉండేది అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఎస్ఆర్బిసి, తెలుగు గంగ, బానకకచర్ల తదితర సాగునీటి ప్రాజెక్టులకు పునాది వేసి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందించి సస్యశ్యామలం చేశారన్నారు. జిల్లాలో రైతుల కోసం ఏర్పాటుచేసిన ఆగ్రో, షుగర్ ఫ్యాక్టరీలు అంతరించి ఉపాధి లేకుండా చేశాయన్నారు. గతంలో ఐదు లక్షల ఎకరాలు పత్తి పండించే రైతులు నేడు లక్ష ఎకరాలకు పరిమితమై ఉన్నారని ఇందుకు గల కారణాలను అన్వేషించాలని మంత్రి పేర్కొన్నారు. అలగనూరు ప్రాజెక్ట్ పూర్తి అయితే 40 టీఎంసీ లనీరు నిల్వ ఉంటుందని, అలాగే పోలవరం పూర్తయితే శ్రీశైలం వాటర్ ను పుష్కళంగా మనమే వాడుకోవచ్చని మంత్రి తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం బాధాకరమని, రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం గురించి పూర్తి అవగాహన ఉన్న, నిత్యం పొల్లాల్లో ఉండే రైతన్నలకు తాము కొత్తగా వ్యవసాయంలో మెళుకువలు చెప్పే పరిస్థితి ఉత్పన్నం కాదన్నారు. తాము కూడా రైతు కుటుంబం నుంచే వచ్చామని, చిన్నతనంలో మా తల్లిదండ్రులుకు వ్యవసాయ పనుల్లో సాయపడేవాళ్లమన్నారు.. అయితే నేడు కాలం మారిందని అందుకనుగుణంగా.. ఆధునిక వ్యవసాయ పద్దతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంటల సాగులో సరికొత్త విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి చూసి రైతులు కూడా నూతన వ్యవసాయ విధానాలకు అలవాటు పడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి సాధించే.. శనగ, కొర్రలు, ప్రొద్దు తిరుగుడు, మొక్క జొన్న వంటి నూతన వంగడాలను ఆవిష్కరిస్తున్నారని వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. సాంకేతికతను, నూతన వంగడాలను ఉపయోగించి, వ్యవసాయంలో మెరుగైన పలితాలు సాధించవచ్చన్నారు. ఇప్పటికైనా రైతులు తమ ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో అధిక పంట దిగుబడులు సాధించే విధంగా ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంభించాలని మంత్రి పిలుపునిచ్చారు.*

*భూపరీక్షలు (సాయిల్ టెస్టింగ్) చేసినప్పుడు, పంట మార్పిడి అవసరమని, తరచుగా ఒకే పంటను వేయడం, ఎరువులు వినియోగం ఎక్కువ కావడం వల్ల భూసారం తగ్గిపోతుందన్నారు. నేడు మార్కెట్ లో ఒక పంటకు రేటు ఎక్కువ ఉందని తెలిస్తే అందరూ అదే పంటను వేయడం వంటి కారణాలతో ఆ పంట ఉత్పదాకత పెరిగి, దిగుబడి వచ్చే నాటికి ఆ పంటకు మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో రైతుకు గిట్టుబాటు ధర అందని పరిస్థితి నెలకొంటుందన్నారు. కాబట్టి పంటలను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత కూడా రైతులపై ఉంటుందన్నారు. నేడు వ్యవసాయానికి కూలీల కొరత కూడా తీవ్రంగా వేధిస్తాందని, కూలీ ఖర్చులను తగ్గించుకోవడానికి, నేడు యాంత్రీకరణను పెంచుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ప్రభుత్వం కూడా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను కూడా అందిస్తోందని వాటిని వినియోగించుకోవాలన్నారు.  ఇటీవల విజయవాడలో నిర్వహించిన డ్రోన్ సదస్సు ద్వారా.. వ్యవసాయ రంగంలో రానున్న రోజుల్లో డ్రోన్ ల వినియోగం మరింత పెరగనుందన్నారు. డ్రోన్ ల ద్వారా స్ప్రే చేయడం వంటివి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగంలో వచ్చిన వినూత్న పరికరాలను అందిపుచ్చుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా రైతులు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో కూడా పోలవరం నిర్మాణం పూర్తయితే, రాయలసీమ సస్యశ్యామలం అవుతుందనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో నదుల అనుసంధానానికి తెరతీశామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో త్వరలో మరిన్ని ప్రాజెక్టులు పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో నీరు – చెట్టు అనే కార్యక్రమం చేపట్టడం ద్వారానే నేడు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన కారణమన్నారు. మాది రైతు ప్రభుత్వం.. రైతులకు అండగా ఎప్పుడూ మా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా రైతు కార్మికులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.. అలాగే స్థానికంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.*

*జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రైతు బిడ్డగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 5.9 లక్షల ఎకరాలు సాగునీటి కాలువల కింద సాగవుతున్నాయని... రైతులు భూసార పరీక్షలు నిర్వహించుకుని అందుకు అనుగుణంగా పంటలు వేసుకొని మంచి దిగుబడులు సాధించాలన్నారు. ఎరువులు మోతాదుకు మించి వినియోగించడం వల్ల భూములు నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు. రైతులు అనురాధనా పద్ధతులను అవలంబించి మిశ్రమ పంటలు వేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. పండిస్తున్న చిరుధాన్యాలకు వ్యాల్యూ ఎడిషన్, ప్యాకింగ్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 70 వేల హెక్టార్లలో ఒకే సెనగ పంటకు పరిమితమై మిగిలిన 9 నెలల కాలం వృధాగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను మోటివేట్ చేయాలన్నారు. ప్రతి కుటుంబం ఉపాధి పరిశ్రమగా మారాలని కలెక్టర్ తెలిపారు. అధునాతన పద్ధతులను అందిపుచ్చుకొని చక్కటి వ్యవసాయం చేసే సత్తా రైతుల్లో ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.*

*అంతకుముందు కిసాన్ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను, ఏర్పాటు చేసిన స్టాళ్లను సైతం మంత్రులు, కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కిసాన్‌ మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు పండించి తీసు కొచ్చిన వ్యవసాయ ఉత్పత్తులు భళా అనిపిం చాయి. అనంతరం వ్యవసాయంలో నూతన ఆవిష్కరణల కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు మంత్రుల చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు