శక్తివంతమైన ఆయుధం విద్య... ఎమ్మెల్యే బుడ్డా.
శక్తివంతమైన ఆయుధం విద్య... ఎమ్మెల్యే బుడ్డా.
పండుగల మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం,
నాణ్యత మైన విద్యతో బాలికల అభ్యున్నతి తే కూటమి ప్రభుత్వం ధ్యేయం,
ఆత్మకూరు డిసెంబర్ 7 నంది పత్రిక,
ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ఉజ్వల భవిష్యత్తును అందించే మహా శక్తివంతమైన ఆయుధం విద్యనని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ మగ ఆడ తేడా లేకుండా సమానంగా చదివించి తమ పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు, శనివారం విద్యకు అత్యున్నత స్థానం కల్పిస్తూ విద్యా రంగానికి పెద్ద పీట వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా తల్లిదండ్రుల సమావేశానికి శ్రీకారం చుట్టగా పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్యత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు, ఎమ్మెల్యే బుడ్డాకు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ మగ భేదం లేకుండా సమానంగా చూస్తూ చదువులో ప్రోత్సహించాలని అన్నారు, చిన్న వయసులోనే ఆడపిల్లలకు వివాహాలు చేసి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేయొద్దని అన్నారు, అడుగడుగున ఆడపిల్లల పట్ల విపక్షత చూపుతూ మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతూ వారి జీవితాలను చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కూటమి ప్రభుత్వంలో చదువుకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మెగా తల్లిదండ్రుల సమావేశానికి శ్రీకారం చుట్టారని అన్నారు, అవగాహన లేని తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ద్వారా వివరించి ఆడపిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని అన్నారు, నియోజకవర్గంలో విద్యకు ప్రాధాన్యత నిస్తూ అందుకు తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నానని అన్నారు, ఆడపిల్ల అంటేనే చిన్న చూపు గా చూస్తే సాంప్రదాయినికి స్వస్తి పలికి నాణ్యమైన విద్య నందించి బంగారు భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి తల్లిదండ్రులపై ఉందన్నారు, అనంతరం విద్యార్థులు ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి, ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విద్యా కమిటీ చైర్మన్ ను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,
Comment List