కార్తీక పురాణం 25,వ అధ్యాయము
కార్తీక పురాణం 25,వ అధ్యాయము
అంబరీషుని మనోవ్యధ:నంది పత్రిక (నవంబర్ 25):
సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు, క్షణాల మీద శ్రుతి స్మృతి శాస్త్ర పురాణదులన్నిటినీ మననం చేసుకుని "మహారాజా! సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందునా జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై వుంటున్నాడు. ఆ జఠరాగ్ని, ప్రాణవాయువుచేత ప్రజల్వింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాసా బాధగా చెప్పబడుతూ వుంది కాబట్టి, యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ వున్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే -
శ్లో|| అథ శ్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం
అతిక్రమ్య న భుంజీత గృహమే ధ్యతిథి౦, నిజమ్ ||
స్నానం చెయ్యకుండా భోజనమునుచేసేవాడు __ మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే బోజనమును చేసేవాడు __ ఆ శుద్ద౦లో పురుగువలే మలాశియే అవుతాడు. పక్వమైనది గాని, ఫలంగాని, పత్రంగానీ, నీల్లుగాని __ బోజనార్ధంగా భావించి సేవించిన దేదైనాసరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీచేత అంగీకృతుడైన అతిథిని __ నేను రాకుండానే, నాకంటే ముందుగా అన్న ప్రతినిదిగా జలపారణమును చేశావు. బ్రాహ్మణా రిస్కరమైన నువ్వు బ్రాహ్మణా ప్రియుడైన విష్ణువునకు భక్తుడివెలా అవుతావు? "యదా పురోధసన్స్వస్య మదమోహన్మహీనతే " నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా, మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు" అన్నాడు దుర్వాసుడు.
ఆ అగ్రహానికి భయకంపితుడైన అంబారీషుడు దోసలి నోగ్గినవాడై __"మునీంద్రా! నేను పాపినే! పరమ నీచుడనే అయినా నిన్ను శరణు కోతురున్నాను. నేను క్షత్రియుడను గనుక __ ఏ అభిజా త్యాహంకారము వల్లనో తప్పునో చేశాను, కాని, నువ్వు బ్రాహ్మణుడైన కారణముగా __ శాంతాన్ని వహించు. నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప __ మమ్మల్ని ఉద్దరించేవాళ్ళేవరు౦టారు?" అంటూ, అతని పాదాల మీదపడి ప్రార్ధించాడు. అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేసాడు. రవంత యెడంగావెళ్ళి "ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్ధిస్తే వాళ్ళు శాంతులవుతారు. కాని, నేనలాంటివాడిని కాను, నాకు కోపం వస్తే, శాపం పెట్టకుండా వుండను. చేపగానూ, తాబేలుగానూ, పందిగానూ, మరుగుజ్జు వానిగానూ, వికృతమైనా ముఖం కలవానిగానూ, క్రూరుడైన బ్రాహ్మణునిగానూ, జ్ఞానశూన్యడైన క్షత్రుయునిగానూ, అధికారంలేని క్షత్రుయునిగానూ, దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగానూ, నిర్ధయా పూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణునిగానూ_ పదిజన్మల (గర్భ నరకాల) ననుభవించు," అని శపించాను . అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి వున్నాడు.
అబరీషుడు , అయినా అతని అంతరర్యంలో సుస్థితుడై వున్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోకకళ్యాణార్దమూ, బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కారించకూడదనే తన వ్రతంవల్లా ఆ పదిజన్మల శాపాన్నీ తానె భరించదలచి __"గృహ్ణమి" అని వూతుకున్నాడు. "ఇన్ని శాపాలిస్తే __ గృహ్ణమి " అంటాడేమిటీ రాజు? వీనికిమ్కా పెద్దశాము యివ్వాలి" అని మరోసారి నోరు తెరవబోయాడు. దుర్వాసుడు __ కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే __ భక్తుడైన అంబరీషుని రక్షాణార్ధ౦గా తన ఆయుధమైనా సుదర్శనాన్ని వినియోగించడంతో, అక్కడి పూజాస్థానంలో వున్న యంత్రాన్ని ఆవహించి __ జగదేక శరణ్యమూ, జగదేక భీకరమూ అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం, దివ్యకాంతి ప్రభాశోభతమై తనవంకగా కదలి రావడాన్ని చూడగానే - దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కగూడదని - భూచక్రమంతా గూడా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా 'సుదర్శనం' అతగాడిని తరుముతూనే వుంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు - వశిష్ఠాది బ్రహ్మర్షులనీ, ఇంద్రాది అష్టదిక్పాలకులనీ, చిట్టచివరికి శివ-బ్రహ్మలనీ గూడా శరణుకోరాడు. కాని, అతని వెనకనే విహ్వల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తూన్న విష్ణుచక్రాన్ని చూసి - ఎవరికి వారే తప్పుకున్నారే తప్పవిడిచి, తెగించి యేవరూ అభయాన్నీయలేదు.
పంచవింశోధ్యాయ స్సమాప్తః
సర్వే జనాః సుఖినోభవంతు
Comment List