నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక మధుమణి ఆసుపత్రి సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ నేత్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో, ఆప్తాల్మిక్ సొసైటీ అకాడమిక్ రీసెర్చ్ కమిటీ పర్యవేక్షణలో నేత్ర వైద్యుల కోసం" కంటిలో గ్లకోమా సమస్యలు" అన్న అంశంపై ప్రాంతీయ వైజ్ఞానిక వైద్య సదస్సు నిర్వహించారు.
నంద్యాల జిల్లా నేత్ర వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి అధ్యక్షతన, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర రెడ్డి, చీఫ్ పాట్రన్ డాక్టర్ జగన్మోహన్ నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ నర్సిరెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మహిళా వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర ఆప్తాల్మిక్ సొసైటీ అకాడమిక్ రీసెర్చ్ కమిటీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ అన్ని విభాగాల వైద్యులు నిరంతరం వైజ్ఞానిక సదస్సులు నిర్వహించడం ద్వారా తమ వైద్య విజ్ఞానాన్ని మెరుగు పరుచుకోవాలని,ఆధునిక వైద్య విధానాలు,నూతన పరికరాల గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. డాక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ నంద్యాలలో ప్రాంతీయ నేత్రవైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ప్రత్యేక వైద్య విభాగాలలో ఒక్కోసారి ఒక అంశం మీద ప్రత్యేక సదస్సులు నిర్వహించడం ఆ జబ్బులపై లోతైన అవగాహన కల్పిస్తుందన్నారు.
నిర్వాహక కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర రెడ్డి, చీఫ్ పాట్రన్ డాక్టర్ జగన్మోహన్, కర్నూలు జిల్లా నేత్ర వైద్యుల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ నర్సిరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగ సురేష్, డాక్టర్ సంజీవ్ సభలో ప్రసంగిస్తూ యువ నేత్ర వైద్యుల కోసం నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు తరచూ నిర్వహించి వారికి ఆధునిక చికిత్స విధానాలపై కార్యశాలలు నిర్వహిస్తామని తెలిపారు. తద్వారా ప్రజలకు ఆధునిక నేత్ర వైద్యాన్ని అందిస్తామన్నారు.
ఈ సదస్సులో వివిధ అంశాలపై ప్రత్యేక వక్తలుగా పాల్గొన్న
ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్, డాక్టర్ క్రాంతి, డాక్టర్ మదన్మోహన్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ విజయ, డాక్టర్ సింధూర మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా సదస్సులో ఉపన్యసించారు.
వక్తలను ఆహ్వాన కమిటీ తరఫున సత్కరించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల, కర్నూలు ,అనంతపురం తదితర జిల్లాల నుండి నేత్ర వైద్యులు పాల్గొన్నారు.
Comment List