యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది

On

యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది

-నిత్యం పని ఒత్తిడితో ఉండే వారికి యోగా మంచి ఔషదంలా పనిచేస్తుంది

IMG_20241129_191544

నంద్యాల ప్రతినిధి. నవంబర్ 29  . (నంది పత్రిక ):నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు సాయుద బలగాల అడిషనల్ ఎస్పీ చంద్రబాబు ఆద్వర్యంలో నేడు పోలీస్ పెరేడ్ డ్రిల్ కార్యక్రమంలో భాగంగా యోగా ట్రైనర్ ఆశ సహకారంతో నిత్యం పని ఒత్తిడితో సిబ్బంది ఇబ్బందులు పడకుండా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని సదుద్దేశంతో యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి ఎంతో ముందుచూపుతో మన సమాజాన్నిఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా అనే చక్కటి ప్రక్రియను ఏర్పాటు చెయ్యడం జరిగింది.మనకున్న ఒడిదుడుకులతో,పని ఒత్తిడితో ఎన్నోరకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ యోగాను తన దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలని తద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు దురమౌతాయి.యోగ సాధన వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని మరియు మానసిక ప్రశాంతత కల్గుతుంది.ధ్యానం,యోగా వల్ల ఎంతో ప్రశాంతత చేకూరుతుందని,  సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుందన్నారు.పోలీసులు విధులలో రోజువారి జీవితాలు ఆరోగ్య మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, యోగ సాధన చేయడం వల్ల  మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా బయటపడవచ్చునని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సాయుధ బలగాల అడిషనల్ ఎస్పీ తో పాటు ఇన్స్పెక్టర్లు ఇస్మాయిల్ ఆన్సర్ భాష రిజర్వు ఇన్స్పెక్టర్లు మంజునాథ్ , శ్రీనివాసులు నంద్యాల టౌన్ లోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు