రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు సమన్యాయం

On

రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు సమన్యాయం

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్.

సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి

జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా.

GridArt_20241126_181705486

కర్నూలు, నంది పత్రిక .......రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్ పేర్కొన్నారు. 
మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి.భరత్,
జిల్లా కలెక్టర్ పి. రంజిత్  బాషా,ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి,  ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి,ఆదోని సబ్ కలెక్టర్  మౌర్య భరద్వాజ్ తదితరులు రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
 ఎంతోమంది మహానుభావులు  దశాబ్దాల తరబడి చేసిన త్యాగాల ఫలితంగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభించాయని, ఆ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను  బాధ్యతాయుతంగా  వినియోగించుకునేలా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ నేతృత్వంలో ఒక  గొప్ప రాజ్యాంగాన్ని  రూపొందించారన్నారు..ఈ రాజ్యాంగం ద్వారా  దేశాన్ని అన్ని విధాలా పురోగతి వైపు ఏ విధంగా తీసుకెళ్లాలని  దిశా నిర్దేశం చేశారన్నారు.. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసుకుంటూ,రాజ్యాంగ  స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.. 

సమాజంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి

జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు...1949, నవంబర్ 26 న  భారత రాజ్యాంగాన్ని దత్తత చేసుకోవడం జరిగిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు..నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇదే రోజున జాతీయ చట్ట దినోత్సవం కూడా జరుపుకుంటారన్నారు.. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యంగంలో పౌరుల మౌలిక హక్కులు, విధులు, బాధ్యతలు, స్వేచ్ఛ,సమానత్వం, ఆర్థిక,సామాజిక న్యాయం వంటి అంశాలను స్పష్టంగా పొందుపరచి ఒక గ్రంథంగా మనకు అందించారని  కలెక్టర్ పేర్కొన్నారు.. కులానికి, మతానికి ఒక గ్రంథం ఉండొచ్చు కానీ దేశంలోని అన్ని కులాలు,మతాలు, ప్రాంతాలు.. దేశం మొత్తం అందరినీ ఏక తాటి మీద నడిపిస్తున్న రాజ్యాంగం.. అందరికీ ఒకే ఒక గ్రంథం అని కలెక్టర్  తెలిపారు .... ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను, మన దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన మహనీయులందరినీ స్మరించుకుంటూ  ఈకార్యక్రమాన్నినిర్వహించుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన  విలువలను పాటిస్తూ, వారి ఆశయాలను సాధించేలా ముందుకు వెళ్ళాలని కలెక్టర్ పిలుపునిచ్చారు..పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ రాజ్యంగంలో పొందుపరిచిన అంశాలను ఆచరిస్తూ, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేలా కృషి చేయాలని కోరారు..అనంతరం కలెక్టర్ అధికారులచే రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేయించారు.జిల్లా యువజన సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి  కంట్రోల్ రూం వరకు ర్యాలీ నిర్వహణ
జిల్లా యువజన సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి  కంట్రోల్ రూం వరకు ర్యాలీ నిర్వహించారు..ర్యాలీ లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటై సుమారు 2 సంవత్సరాల 11 నెలల పాటు అన్ని అంశాలను పరిశీలించి సమాజానికి, మన దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు.. భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం అని,  ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిఉందని, అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 26న మన దేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు..ర్యాలీలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది,యువత  పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు