దొంగతనం కేసును చేదించిన పోలీసులు..... సొమ్ము రికవరీ,
దొంగతనం కేసును చేదించిన పోలీసులు..... సొమ్ము రికవరీ,
ఆత్మకూరు (నంది పత్రిక):-డిసెంబర్14:-పట్టణంలోని ఓ ఇంటిలో జరిగిన దొంగతనం కేసును చేదించి దొంగ నుంచి సొమ్మును రికవరీ చేసినట్లు పట్టణ సీఐ రాము తెలిపారు, శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా సీఐ రాము మాట్లాడుతూ పట్టణంలో స్వరాజ్ నగర్ లో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసి ఇంటిలోని బీరువాలో ఉన్న బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు దొంగలించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగిందన్నారు, రోజు రోజుకు దొంగతనాలు పెరగడంతో జిల్లా పోలీస్ బాస్ డీఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాల మేరకు విచారణ మమ్మరం చేశామన్నారు,సీసీ కెమెరాల సహాయంతో సాక్షులను విచారించి దొంగతనం కేసును చేదించడం జరిగిందన్నారు, పట్టణంలోని గరీబ్ నగర కు చెందిన ఖాదర్ బాషా అలియాస్ గుండును అదుపులోకి తీసుకొని విచారి చ్చామన్నారు, అతని వద్ద నుంచి నాలుగు బంగారు ఉంగరాలు, రెండు జతల బంగారు కమ్మలు, బంగారు చైన్ ఒక జత వెండి పట్టీలు, ఒకస్కూటీ,మొత్తం,1,45,000/- విలువ గల ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు, ఎంతో చేత చక్కగా దొంగతనం కేసును చేదించిన సీఐ రాము,, ఎస్సైలు హుస్సేన్ భాష, వెంకట నారాయణరెడ్డి, ఏ ఎస్ ఐ సంజీవుడు,, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ బాలకృష్ణ,,మౌలాలి,, లక్ష్మణ్,, మదర్ సాహెబ్, శివ రాముడు రవికుమార్ లను డీఎస్పీ రామాంజి నాయక్ అభినందించారు,
Comment List