నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి

On

నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి

IMG_20241219_181727

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 19. (నంది పత్రిక ): నంద్యాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ, నేరవాడలో ఎన్ఎస్డీసీ (నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) స్పాన్సర్డ్ స్కిల్ కోర్సుల సర్టిఫికేట్ ప్రదానోత్సవం అత్యంత ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా డొమైన్ స్పెషలిస్ట్, డేటా క్వాలిటీ అనలిస్ట్, మరియు డిజైన్ ఇంజినీర్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన 206 మంది విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు.కార్యక్రమానికి శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ డాక్టర్ ఎం.వి.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరై, సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, "ఈ కోర్సులు నేటి సాంకేతిక యుగంలో యువతకు ఆర్థిక స్వావలంబన సాధించే మార్గంలో ఒక పెద్ద అడుగుగా నిలుస్తాయి.విద్యార్థుల ఈ సాధనతో కళాశాల గర్విస్తోంది," అని అన్నారు.కోర్సు సమన్వయకర్త డాక్టర్ జి.సౌమ్య మాట్లాడుతూ, "ఇటువంటి నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలను తెరవడానికి దోహదం చేస్తాయి. ఈ విజయవంతమైన శిక్షణా కార్యక్రమానికి మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు," అని తెలిపారు.

విద్యార్థులను శిక్షణనిచ్చిన శిక్షకుల జాబితాలో శిక్షకులు రాంబాబు, జావిద్ బాషా,శిక్షకులు వీ.ఎల్.చైతన్య, ఎం.శర్మిలాదేవి, పీ.భాస్కర్,శిక్షకురాలు వి.నాగమణి లు ఉన్నారు. వీరు తమ అనుభవంతో విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందించారు.మొత్తం 240 మంది విద్యార్థులలో 206 మంది ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేయగా, ఈ సంఖ్య కోర్సుల విజయాన్ని ప్రతిబింబిస్తుంది. విద్యార్థులు పొందిన నైపుణ్యాలు వారికి భారతీయ మరియు అంతర్జాతీయ ఐటీ మార్కెట్లో మంచి అవకాశాలు కల్పిస్తాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ, "ఈ శిక్షణా కార్యక్రమం నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించి, రాబోయే సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి నన్ను సిద్ధం చేసింది," అని చెప్పారు.ఈ కార్యక్రమం విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఒక నూతన మార్గాన్ని చూపించింది. విద్యార్థులు, శిక్షకులు, మరియు నిర్వహకుల కృషి ఈ విజయానికి నాంది పలికింది.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు