ఆర్ఎంపీ, పీఎంపీ లు ఐకమత్యంగా ఉంటేనే గుర్తింపు సాదించగలం
ఆర్ఎంపీ, పీఎంపీ లు ఐకమత్యంగా ఉంటేనే గుర్తింపు సాదించగలం
-శిక్షణ ను తిరిగి పునరుద్ధరణ చేయాలి
గుంటూరు ప్రతినిధి. నవంబర్ 26. . (నంది పత్రిక ):ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ (ఆర్ఎంపీ,పీఎంపీ అసోసియేషన్స్) రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేట సీపీఎం పార్టీ ఆఫీసు ఆవరణలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిలుగా పీఎంపీ జాతీయ కార్యదర్శి, ఫెడరేషన్ వ్యవస్ధాపక అధ్యక్షులు వీబీటీ రాజు,రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్య సమాజంలో కీలకమైన ఆర్ఎంపీ, పీఎంపీ లు ఐకమత్యంగా పోరాడితేనే గుర్తింపు సాదించగలమని వారు అన్నారు.
ప్రస్తుతం ప్రజలను ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్ పై క్షేత్ర స్థాయిలో, మండలాల స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే అధునాతన వైద్య విధానాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఫెడరేషన్ వ్యవస్ధాపక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్ఎన్ రాజు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు నిలిచిపోయిన శిక్షణ ను తిరిగి పునరుద్ధరణ చేసి ఆర్ఎంపీ పీఎంపీ లను గుర్తించేందుకు ఇచ్చిన హామీని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎమ్ శేషసాయి స్వాగతం పలికారు.ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, కోశాధికారి కే కృష్ణమూర్తి, పర్ల దస్తగిరి,ఎస్కే ఖాజా వలి,జి కృష్ణమూర్తి, తోరాటి ప్రభాకరరావు, ఎమ్ జయరామ్ లు ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి ది ఆర్ఎంపీ పీఎంపీ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహాయ సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నాయకులు సత్తార్,ఎస్కే బాబు, జి శివరామకృష్ణ,టి నరసింహ రావు, బర్కతుల్లా,చంద్రశేఖర్, ప్రసూన,సాంబశివరావు, శ్రీనివాసరావు, హబిబుల్లా,రమేష్, మాధవ్,నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.
Comment List