స్వరాజ్ నగర్ లోని ఓ జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో భారీ చోరీ
స్వరాజ్ నగర్ లోని ఓ జూనియర్ అసిస్టెంట్ ఇంట్లో భారీ చోరీ
10 తులాల బంగారు, 70 వేల నగదు, ఓ స్కూటీని ఎత్తుకెళ్లిన దొంగలు
వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న పట్టణవాసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు
ఆత్మకూరు డిసెంబర్ 09 నంది పత్రిక
ఆత్మకూరు పట్టణంలోని స్వరాజ్ నగర్ కాలనీ లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి 10 తులాల బంగారు, 70 వేల నగదుతో సహా ఓ స్కూటీని దొంగలు ఎత్తుకొని వెళ్లారు. ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆదిలక్ష్మి ఆదివారం సెలవు దినం కావడంతో పని నిమిత్తం ఇంట్లో అందరూ ఇంటికి తాళం వేసి బెంగళూరు వెళ్లారు తిరిగి వచ్చి చూసుకునే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇళ్లను నిర్మించుకున్నప్పటికీ చిన్నపాటి ఖరీదైనటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇంటి యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సీసీ కెమెరాల ఉపయోగాలపై పలు మార్లు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇంటి యజమానులలో మార్పు రావడంలేదని ఆత్మకూరు డిఎస్పి రామాంజనేయ అన్నారు.
Comment List