మ్యాన్ హాల్ కు మరమత్తులు చేపట్టండి

On

పట్టించుకోని అధికారులు ,నాయకులు

d4f64887-2cb7-4fa3-bc34-ec83c72dadb7మ్యాన్ హాల్ కు మరమత్తులు చేపట్టండి

విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడొద్దు.

-మ్యాన్ హాల్ కు మరమత్తులు చేపట్టండి
-పట్టించుకోని అధికారులు ,నాయకులు

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 04 . (నంది పత్రిక ):నంద్యాల పట్టణంలో లక్షలు,లక్షలు పన్నులు చెల్లిస్తున్న మౌళికసదుపాయలు కల్పించడంలో రాజకీయ నాయకులు,అధికారులు ఘోరంగా విఫలం అయ్యారు.పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా చిన్నపాటి గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి నంద్యాల మున్సిపాలిటీ ది.నంద్యాల కంటే గ్రామీణ ప్రాంతాలు మేలు అన్న విధంగా తయారైంది.వివరాల్లోకి వెళితే పాల్ టెక్నిక్ కలా శాల, భరతమాత దేవాలయం నుండి బాలాజీ కాంప్లెక్స్ వెళ్లే దారిలో ఉన్న మ్యాన్ హాల్ కు పైన ఉన్న ప్లేట్ లేదని మూడు నెలలుగా మున్సిపల్ అధికారుల దృష్టికి,సచివాలయం సిబ్బందికి,వార్డ్ కౌన్సిలర్ కు సమస్యను వివరించినా ఫలితం శూన్యంగా మారింది.రోజు కళాశాలకు, స్కూల్ కు  వెళ్ళేవారు,రాత్రి వేళల్లో అటు వైపు వెళ్లే వారు మ్యాన్ హాల్ కనపడక ప్రమాదాల భారిన పడ్డారు.పలువురు విద్యార్థులకు , వృద్ధుల కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది.నిన్న రాత్రి ముగ్గురు విద్యార్థులు క్రింద పడినట్టు తెలుస్తోంది.పిర్యాదు చేస్తే మున్సిపల్ అధికారులు దురుసుగా మాట్లాడుతున్నారని,నిధులు లేవు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని కాసురుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.నంద్యాల నేతలు అంటే మున్సిపల్ అధికారులు పుచిక పుల్లలా తీసివేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొందరు అధికారులు ఏకంగా లక్షలు ఇచ్చి పోస్టింగ్స్ తెచ్చుకున్నామని ,డబ్బులు ఊరికే రావు అంతా మా ఇష్టం అని అధికారులు ప్రవర్తిస్తున్నారు.అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు