అంగన్వాడి, సచివాలయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ

On

అంగన్వాడి, సచివాలయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20241127_182736

ఆళ్లగడ్డ/నంద్యాల ప్రతినిధి. నవంబర్ 27 . (నంది పత్రిక ):దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నే గ్రామంలో అంగన్వాడి, గ్రామ సచివాలయ కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.అంగన్వాడి కేంద్ర తనిఖీలో భాగంగా పిల్లలకు సంబంధించిన హాజరు నమోదు వివరాలను అంగన్వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఎంతమంది ఉన్నారు, రోజు వారికిచ్చే ఆహార మెనూ, వయసుకు తగ్గట్టు పొడవు, బరువు ఉన్నారా లేదా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలకు వచ్చే పోషణ్ అభియాన్ కిట్లను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు లేవని కార్యకర్త సమాధానం చెప్పడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ ముందుగానే తెప్పించుకోవాల్సిన బాధ్యత లేదా అని కలెక్టర్ ప్రశ్నించారు. అంగన్వాడి కేంద్రాన్ని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. టాయిలెట్లను పరిశీలిస్తూ ట్యాప్ కనెక్షన్ ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంటి పిల్లలతో ముచ్చటించారు.అనంతరం గ్రామ సచివాలయ కేంద్రాన్ని తనిఖీ చేస్తూ వ్యవసాయ సిబ్బందితో రైతుల బీమా ప్రీమియం చెల్లింపుపై కలెక్టర్ ఆరా తీశారు. గ్రామ సచివాలయ సమీపంలో ఉన్న రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ పంట బీమా ప్రీమియం చెల్లింపు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సచివాలయ సిబ్బంది అందరూ సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సర్వీసులు గడువులోగా అందించాలని కలెక్టర్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

 

*దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఉపాధ్యాయులని ఆరాతీస్తూ శ్రద్ధగా నేర్పించాలని కలెక్టర్ పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలకు గైరాజరు కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అందుబాటులో వున్న టాయిలెట్లను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు