నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా వినతుల స్వీకరణ
నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా వినతుల స్వీకరణ
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 08 . (నంది పత్రిక ):ఈ నెల 09వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పిజిఆర్‌ఎస్)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 09వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comment List