డిఎస్పీ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
డిఎస్పీ కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
-డిఎస్పీ శ్రీనివాసరెడ్డి
నంద్యాల ప్రతినిధి. నవంబర్ 26. . (నంది పత్రిక ):ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు.1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అంటే భారత రాజ్యాంగ అసెంబ్లీ రాజ్యాంగాన్ని స్వీకరించింది. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని నంద్యాల డిఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు.భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా నంద్యాల డి ఎస్పీ కార్యాలయం నందు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగా సంస్థలలో రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల అందరికీ అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చెయ్యడం జరుగుతుందని,చట్టాన్ని అమలు చేసే అధికారులుగా, ఈ విలువలను సమర్థించడం ప్రతి పౌరుడు సురక్షితంగా, గౌరవంగా మరియు సాధికారతతో ఉన్నట్లుగా భావించడం అందరి కర్తవ్యం. వివక్ష లేదా అన్యాయానికి భయపడకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comment List