పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ఆహ్వానం
పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ఆహ్వానం
-ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం
-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*
నంద్యాల బ్యూరో. డిసెంబర్ 05 . (నంది పత్రిక ):ఈనెల 7వ తేదీ జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో నిర్వహించే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, పూర్వపు విద్యార్థులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 995 ప్రాథమిక పాఠశాలలు, 110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 294 ఉన్నత పాఠశాలలు వెరసి మొత్తము 1399 పాఠశాలల్లో పెద్ద ఎత్తున మెగా ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాల విద్యార్థులు తయారుచేసిన ఆహ్వాన పత్రికలతో అందరినీ ఆహ్వానించడం జరిగిందన్నారు. పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 1.54 లక్షల మంది విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాల ప్రగతితో పాటు, విద్యార్థుల్లో దాగివున్న నైపుణ్యం, ఆటలు, క్రీడలు లాంటి విన్యాసాలలో ప్రావీణ్యత, తోటి విద్యార్థులతో ప్రవర్తన, భావవ్యక్తీకరణ, పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలు తదితర విషయాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమావేశంలో చర్చించేలా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.*
*విద్యార్థులో దాగి వున్న ప్రతిభను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి యొక్క ఆరోగ్యానికి కూడా పరీక్షించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సంబంధిత విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 31 పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యపై స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు. మిగిలిన అన్ని పాఠశాలల్లో కూడా స్క్రీన్ టెస్ట్ లు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. అదే రీతిలో పాఠశాలలకు కూడా గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారి సలహాలు, సహకారం తీసుకొని పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో హాజరైన ఆహ్వానితులందరికీ శుభదిన్ భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 7వ తేదీన పండుగ వాతావరణంలో నిర్వహించుకొనే మెగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భారీ సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Comment List