బాక్సింగ్ పోటీలలో పతకాలు సాధించిన నంద్యాల క్రీడాకారులు
బాక్సింగ్ పోటీలలో పతకాలు సాధించిన నంద్యాల క్రీడాకారులు
-అభినందించిన డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 25 (నంది పత్రిక):కోయలకుంట్ల లో సోమవారం ఏ ఎన్ కె ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన ఆహ్వాన ప్రాంతీయ బాక్సింగ్ పోటీలలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అకాడమీ క్రీడాకారులు 11 మంది వివిధ వయసు కేటగిరీలలో బంగారు పతకాలు సాధించారు.ఈ సందర్భంగా బుధవారం కళారాధన కార్యాలయంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ విజేతలను,శిక్షణ ఇచ్చిన సర్దార ఖాన్,షా నవాజ్ ఖాన్ లను అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాక్సింగ్ లో చిన్నారులు ఆసక్తి కనపరచడం అభినందనీయమని, భవిష్యత్తులో రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొనడానికి అవసరమైన తర్ఫీదు పొంది, నిరంతర సాధన ద్వారా విజయాలు సాధించాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు సోమేశుల నాగరాజు, నంద్యాల జిల్లా బాక్సింగ్ అకాడమీ సంయుక్త కార్యదర్శి సర్దార్ ఖాన్, కార్యవర్గ సభ్యుడు షానవాజ్ ఖాన్, పతకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొన్నారు.పతకాలు సాధించిన క్రీడాకారులు:జిలాన్,ఆదిల్, చేతన్, తన్వీర్, ముబాశిర, దేవాన్ష్, రితిక, ఆసిద్,ఆఫ్రా ,మంజునాథ్, అజయ్ లు వివిధ వయస్సు కేటగిరీలలో స్వర్ణ పతకాలు, ప్రశంస పత్రాలు అందుకున్నారు.
Comment List