ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

On

ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

-ఇస్తేమా కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి
-జిల్లా ఎస్పీ  అదిరాజ్ సింగ్ రాణా*

-డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షించిన ఎస్పీ

 -నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా 

IMG_20250103_222151

ఆత్మకూరు. జనవరి 03 . (నంది పత్రిక ):ఆత్మకూరు పట్టణంలో ఎంతో ఆర్భాటంగా జరిగే ఇస్తేమా కార్యక్రమానికి కట్టదిట్టమైన భద్రత కల్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా అన్నారు.శుక్రవారం పట్టణ చివర్లో ఏర్పాటు చేసిన  ఇస్తేమా ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు, ఇస్తేమా ఏర్పాట్లపై నిర్వాహకులను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకుని భద్రత ఏర్పాటు పై డిఎస్పి రామాంజి నాయక్ ను అడిగి తెలుసుకున్నారు,అనంతరం ఎస్పీ మాట్లాడుతూ,  ఇస్తేమా కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు అత్యధిక భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఈ కార్యక్రమానికి లక్షలాదిగా ముస్లిం సోదరులు హాజరు కావడం జరుగుతుందన్నారు.డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ భద్రత సమస్యలు తలెత్తకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు,
ఇస్తేమా నిర్వాకులతో ఇతర శాఖ అధికారులతో సమన్యయమై ఇస్తామ  ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు,అనంతరం డిఎస్పి కార్యాలయంలో డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించి రికార్డులను పరిశీలించారు, కేసులు నేరాలు శాంతి భద్రతలపై ఆరా తీసి పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈయన వెంట డిఎస్పి రామాంజనేయ డివిజన్ లోని సిఐలు ఎస్సైలు ఉన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల ప్రతినిధి. జనవరి 05 . (నంది పత్రిక ):ఈ నెల 06వ తేదీ సోమవారం...
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి వారోత్సవాలు
ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
విక్సిట్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లెవల్‌కి శాంతిరామ్ విద్యార్థులు   
జిల్లా అభివృద్ధి పై మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో సమావేశమైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పట్టుబడిన 39.549 kg ల గంజాయిని ద్వంశం చేసిన జిల్లా పోలీసులు