కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

On

కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

IMG_20250105_205746

-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల ప్రతినిధి. జనవరి 05 . (నంది పత్రిక ):ఈ నెల 06వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పిజిఆర్‌ఎస్‌)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం" కార్యక్రమానికి ఈ నెల 06వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం నంద్యాల రూరల్, జనవరి 06 (నంది పత్రిక): కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్నీ ఎప్పటికీ మర్చిపోలేము. ఐదేళ్ల...
రూ. 50 కోట్లతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి వారోత్సవాలు
ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
విక్సిట్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లెవల్‌కి శాంతిరామ్ విద్యార్థులు