రూ. 50 కోట్లతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

On

రూ. 50 కోట్లతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..

IMG_20250106_220731

నేడు బనగానపల్లె పట్నంలో బైపాస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

ఏడాదిన్నర కాలంలో రింగ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..

గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్ అండ్ బి శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.

వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేసి ఆర్ అండ్ బి శాఖకు పూర్వ వైభవం తీసుకొస్తాం..

గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రూ. 861 కోట్లతో చేపట్టిన రహదారులు మరమ్మత్తు పనులు జనవరి ఆఖరు నాటికి పూర్తి చేస్తాం..

7 జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా  నెమ్మదించిన రహదారుల మరమ్మత్తు పనులను వేగవంతం చేస్తాం..

దాదాపు 50 శాతం రహదారుల మరమ్మత్తులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది..

 అలాగే దాదాపు 3000 కి.మీ మేర రహదారులను త్వరలో పిపిపి విధానంలో  చేపట్టనునన్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

బనగానపల్లె పట్టణ ప్రజల చిరకాల కల అయిన రింగ్ రోడ్డును ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేడు బనగానపల్లె పట్టణం పాణ్యం రోడ్‌ వద్ద రూ. 50 కోట్లతో చేపడుతున్న బనగానపల్లె రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బనగానపల్లె రింగ్ రోడ్డును 15 కి.మీ.కు పైగా నిర్మిస్తున్నామని తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ పరిధిలో 4.5 కి.మీ., ఆర్ & బి శాఖ పరిధిలో 11 కి.మీ. మేర నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణ దాదాపుగా పూర్తి అయిందని, ఇంకా సేకరించాల్సిన కొంత భాగానికి ఆర్థిక శాఖ నుంచి రూ. 5 కోట్లు క్లియరెన్స్ అవుతుందని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో, ఆర్ & బి అధికారుల సహకారంతో నూతన రింగ్ రోడ్డు ప్రాజెక్టును సంవత్సరంన్నరలో పూర్తి చేసి, బనగానపల్లె మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అత్యాధునిక రింగ్ రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో  ఆర్ & బి శాఖను  వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే  గుంతల రహిత రహదారులే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 861 కోట్లతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 50 శాతంకు పైగా గుంతలు పూడ్చే పనులు పూర్తి చేశామని తెలిపారు. అకాల వర్షాలు, తుఫానుల వల్ల 7 జిల్లాల్లో పూర్తి చేయలేకపోయిన పనులను ఇప్పుడు వేగవంతం చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జనవరి నెలాఖరు నాటికి  రాష్ట్రాన్ని గుంతల రహితంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే పీపీపీ విధానంలో దాదాపు 3 వేల కి.మీ. రహదారుల నిర్మాణం చేపడుతామని, ఇప్పటికే అంచనా వ్యయంపై ఓ ఏజెన్సీని నియమించినట్లు తెలిపారు. అలాగే కొత్తగా చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డితోపాటు, ఆర్ & బి శాఖ ఈ ఎన్ సి నయిముల్లా తదితర ఉన్నతాధికారులు,  కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నంద్యాల రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నంద్యాల రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
నంద్యాల రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నంద్యాల ప్రతినిధి. జనవరి 07 . (నంది పత్రిక ):జనాభా ప్రాతిపదికన మేరకు నంద్యాల అర్బన్ మండల...
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం
రూ. 50 కోట్లతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి వారోత్సవాలు
ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ