సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి వారోత్సవాలు
సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి వారోత్సవాలు
నంద్యాల ప్రతినిధి. జనవరి 04 . (నంది పత్రిక ):సావిత్రిబాయి పూలే, షేక్. ఫాతిమ జయంతి సందర్భంగా బాల అకాడమీ నందు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.డి.పి. నాయకులైన ఫయాజ్ , ఎస్.ఎండి.అబులైజ్ డాక్టర్. నిరంజన్ స్టేట్ జనరల్ సెక్రటరీ సయ్యద్. ఇమ్రాన్ పాషాస్టేట్ ప్రెసిడెంట్ షేక్.నబి రసూల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ తదితరులు మరియు బాల అ కాడమీ పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మేడం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి అయిన ఫయాజ్ మాట్లాడుతూ సావిత్రిబాయి జీవితం ఆమె చేసిన కృషి ఆదర్శనీయమని చెబుతూ ఆయన బాల అకాడమీ పూర్వపు విద్యార్థినని ఫస్ట్ క్లాస్ వారి నాన్న,అమ్మ నంద్యాలలో ఫ్యామిలీ ఉన్నంతవరకు ఇక్కడే చదువుకున్నానని మళ్లీ ఈ పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఎస్.ఎండి. అబులైజ్ మాట్లాడుతూ స్త్రీలకు చదువు కోసం సావిత్రిబాయి తన జీవితాన్ని త్యాగం చేయడం వలననే ఈరోజు బాలికలందరూ చదువుకుంటున్నారని ఆమె కృషి మరువలేనిదని తెలిపారు. డాక్టర్ నిరంజన్ మాట్లాడుతూ నేటి కాలంలో విద్యార్థులు ఫోన్, టీవీ చూస్తూ సమయాన్ని వృధా అలా కాకుండా గొప్ప వారి జీవితాలను తెలుసుకొని వారు చూపిన మార్గంలో నడవాలని తెలిపారు.మాధవీలత మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే అని ఆమె లాంటి పట్టుదల కార్యసాధన నేటి తరానికి ముఖ్యంగా స్త్రీ సాధికారకతకు చాలా అవసరమని తెలియజేశారు.
ఎం.జి. వి. రవీంద్రనాథ్ మాట్లాడుతూ అల్ మేవ ,ఆల్ ఇండియా ముస్లిం ఎంప్లాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ నంద్యాల యూనిట్ శాఖ ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్లి ఎంప్లాయిస్ వెల్ఫేర్ కోసం కరోనా టైంలో ఉచితరేషన్ కిట్, మెరిట్ విద్యార్థులకు పారితోషకాలు, హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిందని చెప్పారు.నబి రసూల్ మాట్లాడుతూ మనమందరము సావిత్రిబాయి పూలే నుండి మూడు విషయాలను గమనించవలెను అవి ఏమనగా ఆమె చాలా ధైర్యవంతురాలు సేవాగుణం మరియు జ్ఞానవంతురాలు కలిగి మహిళ అని తరానికి ఆమె జీవితం ఒక మార్గదర్శకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్మోయవా నిర్వహించిన వ్యాసరచన వకృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫయాజ్ ని సభ్యులను బాలఅకాడమీ యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి జాతీయ ఉత్తమ అవార్డు పొందిన ప్రిన్సిపల్ మేడం మాధవీలత గారిని ఆల్మేవ సభ్యులు సన్మానించి గౌరవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.డి.పి. నాయకుడు ఫయాజ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి.రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత, సభ్యులు, పల్లె వెంకటసుబ్బయ్య టి.డి.పి. ఇంచార్జ్ 6 వార్డ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List