వాటర్ షెడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

On

వాటర్ షెడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

IMG_20241224_233346

నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 24  . (నంది పత్రిక ):భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. మంగళవారం సంజామల మండలంలోని ఆకుమల్ల గ్రామంలో వాటర్షెడ్ పథకం కింద చేపట్టిన చెక్ డాములు, ఫారం ఫండ్స్, మినీ పర్కులేషన్ ట్యాంకులు, గార్బేజ్ స్ట్రక్చర్లు తదితర పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయంలో వాటర్ షెడ్ కమిటీ సభ్యులతో సమావేశమై వాటర్ షెడ్ వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వివరించారు. అట్టడుగున ఉన్న భూగర్భ జలాలను పైకి తీసుకురావడానికి వాటర్ షెడ్లు ఉపయోగపడతాయన్నారు. భూమిపై పడ్డ వర్షపునీరు వృధాగా పోకుండా ప్రతి నీటి బిందువును భూమిలోకి ఇంకింప చేసి భూగర్భ జలాలను పెంచడమే వాటర్ షెడ్  ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కొండలు, వాగు వంకల నుండి నీటిని సంరక్షించి నీటి నిల్వకుంటలు, పొలాల నుండి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, ఇరువైపులా మొక్కలు నాటడం, చెట్లు పెంచడం కందకాల త్రవ్వకం, ఊట కుంటలు, డగవుట్ ఫాండ్స్, ఇంకుడు గుంతలు తదితర పనులు చేపట్టి నీటిని సంరక్షించుకొని అవసరమైనప్పుడు పొలాలకు వినియోగించుకోవచ్చన్నారు. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు కమిటీ సభ్యుల ఆమోదంతో ప్రతిపాదనలు పంపాలన్నారు. జిల్లాలో ఇంకా 20లక్షల పని దినాలను ఉపాధి వేతనదారులకు కల్పించాల్సి ఉందని... సంజామల మండలంలో ఉపాధి పనులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని  వేతన దారులను మోటివేట్ చేసి లేబర్ బడ్జెట్ ను పెంచాలని ఏపీఓ, ఎంపీడీఓలను కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి వేతన దారుడికి రోజుకు 300 రూపాయలు అందిస్తోందని అయితే ఈ జిల్లాలో రోజుకు 245 రూపాయల కూలి మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. లేబర్ బడ్జెట్ ఎంత పెరిగితే అంత మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని ఆ నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు.అనంతరం సచివాలయ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ సమయపాలన పాటించడంతోపాటు నిర్దేశించిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.హౌస్ హోల్డ్ సర్వే, జియో ట్యాగింగ్ తదితర అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ముందుభాగంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ సచివాలయంతో పాటు పరిసర ప్రాంతాలను కూడ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. సోలార్ ఇంజన్లు తదితర వాడకాలపై నిర్దిష్టమైన సూచనలు జారీ చేయాలన్నారు. సచివాలయంలో టాయిలెట్ నిర్మాణానికి సర్పంచ్ సహకారం తీసుకొని ఏర్పాటు చేయించాల్సిందిగా పంచాయితీ సెక్రటరీని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై విఆర్ఓ, సర్వేయర్లతో మాట్లాడుతూ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డ్వామా పిడి జనార్దన్ రెడ్డి, వాటర్ షెడ్ అడిషనల్ పిడి మాధవీలత, ప్రాజెక్ట్ ఆఫీసర్ విజేత, గ్రామ సర్పంచ్, ఎంపీడిఓ,ఏపీడి, ఎపిఓ తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

వట్టివాగులోకి ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి వట్టివాగులోకి ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలి
రైతులను కాపాడాలని కోరుతూ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేత. కేసముద్రం, మార్చి 10(నంది పత్రిక): వట్టివాగులోకి ఎస్సారెస్పీ జలాలను విడుదల చేయాలని కోరుతూ సోమవారం కేసముద్రం మండల...
టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం
నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి ఎన్ ఎం డి ఫారుక్
మహిళా వృద్ధి దేశాభివృద్ధి..
12 న చలో విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి
ఉపాధితో ప్రోత్సాహానికి ఇంటింటా సర్వే. ఎంపీడీవో డి గోపికృష్ణ
నంద్యాల ఎస్ డి పి ఐ కార్యాలయంలో ఈ డి సోదాలు - ఏమీ దొరకక ఖాళీ చేతులతో పలయానం చిత్తగించిన ఈ డి అధికారులు