నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార ప్రజా వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
నంద్యాల ... ప్రజాసమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ప్రజల నుంచి వినతులను స్వీకరించి సానుకూలంగా స్పందించి త్వరితగతిన వాటి పరిష్కారం కొరకు అధికారులను ఆదేశించిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత పాలకులు ప్రజలను గాలికివదిలేసి పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. నంద్యాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గత పాలకులను కలిసే పరిస్థితే లేకపోవడంతో దళరులను నమ్మి మోసపోయరన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ సంక్షేమ రాజ్యం నిర్మిస్తూన్నామన్నారు
నంద్యాలలో తానే స్వయంగా ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గ్రీవెన్స్ ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని తెలిపారు. ఈ సందర్బంగా వివిధ సమస్యలకు (పింఛన్లు , ఇంటి స్థలాలు , రేషన్ కార్డులు) లకు సంబంధించిన వినతులను స్వీకరించి వాటిని తానే స్వయంగా నమోదు చేసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Comment List