అణు శక్తి కన్నా యువ శక్తి మిన్న 

On

అణు శక్తి కన్నా యువ శక్తి మిన్న 

విజన్ 2047 లక్యంగా యువత పనిచేయాలి.

చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలి.

స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలి.
 IMG_20241229_205421
- నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 
నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 29 . (నంది పత్రిక ):అణు శక్తి కన్నా యువ శక్తి మిన్న అని, 2047 విజన్ లక్యంగా యువత ముందుకు సాగాలని, స్వామి వివేకానంద చూపిన ఆదర్శ బాటలో యువత పనిచేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు  కావాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు.ఆదివారం నంద్యాల శ్రీ రామకృష్ణ పి జీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో  యువ 2024 ఉత్సవ్ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ యువత, విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం అన్నారు. చెడు అలవాట్లకు బానిసై మంచి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువత కు ఎంపీ శబరి చూసించారు. ప్రపంచం భారతదేశం వైపు చూస్తున్నాయని, ఆగ్రగామి దేశాలకు దీటుగా భారత్ అభివృద్ధి చెందుతోందని, ఇది యువత వల్లే సాధ్యం అని మరువవద్దని ఎంపీ శబరి అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికీ వివిధ రంగాలలో నైపుణ్యం కలిగించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారని ఈ మంచి అవకాశం యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.
నంద్యాల శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల్లో  విలువలతో కూడిన విద్య అందించడం సంతోషంగా ఉందని, వారసత్వ రాజకీయంతో పాటు ఉన్నత చదువు, సంస్కారం, మనో దైర్యం ఎంతో అవసరం అన్నారు. మా  అమ్మ, నాన్నల దీవెనలతో ముందుకు సాగుతున్నానని, నంద్యాల జిల్లా అభివృద్ధిలో  యువత భాగస్వామ్యం పెరగాలని ఆమె కోరారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఇస్తేమా  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ -ఇస్తేమా కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి-జిల్లా ఎస్పీ  అదిరాజ్ సింగ్ రాణా* -డివిజన్ స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షించిన ఎస్పీ...
విక్సిట్ భారత్ యంగ్ లీడర్స్ ఛాలెంజ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లెవల్‌కి శాంతిరామ్ విద్యార్థులు   
జిల్లా అభివృద్ధి పై మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ తో సమావేశమైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పట్టుబడిన 39.549 kg ల గంజాయిని ద్వంశం చేసిన జిల్లా పోలీసులు
ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరించండి
అణు శక్తి కన్నా యువ శక్తి మిన్న 
ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ