జిల్లాలో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు స్థలాలను గుర్తించండి
జిల్లాలో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు స్థలాలను గుర్తించండి
-పూల మొక్కల ద్వారా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి
-జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా
నంద్యాల బ్యూరో. డిసెంబర్ 26 . (నంది పత్రిక ):
నూతన సంవత్సరంలో జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు స్థలాలను అన్వేషించాలని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ జి.రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ముద్రించిన గ్రీట్ విత్ గ్రీన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో రక్త నిల్వ కేంద్ర ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నూతన సంవత్సర వేడుకలను మొక్కల ద్వారా జరుపుకొని నంద్యాల జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ఉపయోగపడేలా నోట్ బుక్స్, జామెంట్రీ బాక్స్ తదితర విద్యా సామాగ్రిని అందజేయాలని కలెక్టర్ సూచించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీకి రెండు స్టాళ్ళు ఏర్పాటు చేస్తారని జనవరి వేడుకల రోజున మొక్కలను, విద్యాసామాగ్రిని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడంతో పాటు సంక్షేమ వసతి గృహాల్లో విద్యాసామాగ్రిని విద్యార్థులకు పంచాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comment List