యాగంటి క్షేత్రంలో మహిళా అఘోరి..
యాగంటి క్షేత్రంలో మహిళా అఘోరి..
పోలీస్ బందోబస్తు మధ్య స్వామి దర్శనం..
సనాతన ధర్మం నా అభిమతం అఘోరి..
బనగానపల్లి నంది పత్రిక నవంబర్ 09:
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో..సంచలనంగా మారిన మహిళ అఘోరి...(నాగసాధు) శనివారం తెల్లవారుజామున బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి కర్నూలు నుంచి యాగంటి క్షేత్రానికి పాదయాత్ర బయలుదేరిన అఘోరి కారణంగా కర్నూల్ హైవేలో ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ఓర్వకల్లు నుంచి ప్రత్యేక వాహనంలో యాగంటి క్షేత్రానికి బందోబస్తు మధ్య తీసుకవచ్చారు. అయితే అర్ధరాత్రి సమయం కావటంతో రాత్రి క్షేత్రంలో బస చేసిన ఆమె శనివారం తెల్లవారుజామున ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం ప్రచారంలో భాగంగా దక్షిణ భారతంలో శైవ క్షేత్రాలను దర్శించుకుంటున్నట్లు తెలిపారు.
యాగంటి క్షేత్రానికి రాక సందర్భంగా బనగానపల్లె పోలీసులు బందోబస్తు చేశారు.
Comment List