చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు

On

చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు

-ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ 

GridArt_20250109_204935959

నంద్యాల ప్రతినిధి. జనవరి 09 . (నంది పత్రిక ):నంద్యాల కు చెందిన ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని ఓకే చాక్ ఫీస్ పై ఇరువైపుల స్వామి యొక్క పది అవతారాలను వాటర్ కలర్స్ తో మైక్రో బ్రష్ ద్వారా మూడు గంటల సమయంలో వినూత్నంగా వేశారు. ఈ సందర్బంగా కోటేష్ మాట్లాడుతూ దశవతారాలు అంటే మహా విష్ణువు యొక్క పది ప్రధాన అవతారాలు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణచి వేయడానికి, మంచిని నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. కోటేష్ వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం, నరసింహ, వరాహ, వామన, కుర్మా, మత్స్య, పరుశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి ఇలా పది అవతారాలను అద్భుతంగా వేసాడు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని వుంటాయి. మహా విష్ణువు గరుడ వాహనం పై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శన మిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడ అంటారు. ఈ పవిత్రమైన రోజున స్వామిని దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగి సుఖ శాంతులతో సంతోషంగా వుంటారు. వెంకటేశ్వర స్వామి పై వున్నా భక్తి తో ఈ చిత్రాన్ని ఇలా చాక్ ఫీస్ పై వినూత్నం వేశారు.

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు
చాక్ ఫీస్ పై స్వామి దశావతారాలు -ప్రముఖ చిత్రకారుడు హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్  నంద్యాల ప్రతినిధి. జనవరి 09 . (నంది పత్రిక ):నంద్యాల...
బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరుకు దరఖాస్తుల ఆహ్వాన
నంద్యాల రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఇవే.. పిల్లలపైనే దీని ప్రతాపం
రూ. 50 కోట్లతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ