తగ్గేదేలే
తగ్గేదేలే..
'పుష్ప ది రూల్' నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్
సినిమా వార్తలు అక్టోబర్ 18 (నంది పత్రిక):
పుష్ప2 విన్నర్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్ వచ్చింది. మరో 50 రోజుల్లో 'వుష్ప ది రూల్ కౌంట్ డౌన్ షురూ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది. అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2'. పుష్ప సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక 'పుష్ప 2 విడుదలకు ఇంకా 50 రోజులు మాత్రమే ఉన్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఈ సినిమాను ప్రీ పోన్ చేసి డిసెంబర్ 05న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి చిత్రబృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతావ్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Comment List