సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనున్న వెంకీ

On

సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనున్న వెంకీ

IMG_20241017_131937

సినిమా వార్తలు (నంది పత్రిక): అక్టోబర్ 17:

సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో వస్తున్న ఈ చిత్రం కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. సంక్రాంతి రేసు నుంచి ఇప్పటికే విశ్వంభర వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్లోకి వెంకీ %-% అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ వచ్చినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ఛేంజర్ సినిమాను అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఆయన నిర్మాణంలోనే వస్తున్న మరో చిత్రం వెంకీ అనిల్ రావిపుడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను మొదట సంక్రాంతికి తీసుకువద్దాం అనుకున్నారు. కానీ అదే టైంలో దిల్ రాజు సోంత ప్రోడక్షన్ నుంచి గేమ్ ఛేంజర్ వస్తుంది. దీంతో వెంకీ అనిల్ రావిపుడి సినిమాను వాయిదా వేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా తప్పుకుంటే అటు గేమ్ ఛేంజర్తో పాటు నాగ చైతన్య తండేల్, బాలయ్య ఎన్బీకే 109 సినిమాలకు ఇది ప్లస్ అవ్వనుంది. ఈ ప్రాజెక్ట్ కథానాయికలుగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటించబోతుండగా.. ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ వెంకటేశ్ భార్యగా నటించనున్నట్లు తెలుస్తుంది.

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు
నేత్ర వైద్యుల ప్రాంతీయ వైజ్ఞానిక సదస్సు నంద్యాల ప్రతినిధి. డిసెంబర్ 22. (నంది పత్రిక ):నంద్యాల,కర్నూలు జిల్లాల నేత్ర వైద్యుల సంఘాల సంయుక్త నిర్వహణలో ఆదివారం స్థానిక...
రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయండి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి
నైపుణ్య శిక్షణలు విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు దోహదం పడతాయి
కిసాన్ మేళాను‘‘ ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి
రహదారుల భద్రతా ప్రమాణాలకు పటిష్ట చర్యలు
RTC ఉద్యోగులకు నైటౌట్ అలవెన్సులు