Gajini 2: 'గజిని 2'.. రూ.1000 కోట్లు: అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
'తండేల్ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత అల్లు అరవింద్ 'గజిని 2' గురించి మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: విడుదలైన అన్ని భాషల్లో హిట్గా నిలిచిన 'గజిని' (Ghajini) సీక్వెల్ కోసం సినీ
ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మూవీపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మనసులో మాట బయట పెట్టారు. ముంబయిలో నిర్వహించిన 'తండేల్ హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ ఈవెంట్కు అమిరాఖాన్ (Aamir Khan) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరవింద్ మాట్లాడుతూ.. "గజిని' చిత్రీకరణ దశలో.. ఇది రూ.100 కోట్లు రాబట్టే తొలి సినిమా అవుతుందని ఆమిర్ మాతో ఛాలెంజ్ చేశారు. ఆ కోణంలోనే మూవీని మేం ప్రమోట్ చేశాం (నవ్వుతూ). ఆశించినట్టే 'గజిని'.. రూ.100 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ఆ 100 ఇప్పుడు 1000 అయింది. అందుకే రూ.1000 కోట్లు రాబట్టే చిత్రాన్ని మళ్లీ అమిర్ హీరోగా నిర్మించాలనుకుంటున్నా. అది 'గజిని 2' అవ్వొచ్చు" అని అన్నారు.
నాగ చైతన్య కోసం అల్లు అర్జున్: 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
సూర్య హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన తమిళ్ మూవీ 'గజిని'ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 'గజిని 2' (Gajini 2) ఉంటుందంటూ సూర్య ఇప్పటికే హింట్ ఇచ్చారు. పార్ట్ 1లానే పార్ట్ 2నూ తమిళంలో సూర్యతో, హిందీలో ఆమిర్తో తెరకెక్కించనున్నారని, ఆ హీరోలు ఒకరి చిత్రంలో మరొకరు అతిథి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ కోలీవుడ్ మీడియాలో ఇటీవల వార్తలొచ్చాయి.
Comment List